The Paradise: జడల్ గాని దోస్త్ ‘బిర్యాని’.. ‘ది పారడైజ్’ లో సంపూర్ణేష్ వైలెంట్ లుక్.. అస్సలు ఊహించలేదుగా..

ది పారడైజ్(The Paradise) సినిమాలో సంపూర్ణేష్ బిర్యానీ అనే పాత్రలో కనిపిస్తాడు అంటూ పోస్టర్ విడుదల చేశారు.

The Paradise: జడల్ గాని దోస్త్ ‘బిర్యాని’.. ‘ది పారడైజ్’ లో సంపూర్ణేష్  వైలెంట్ లుక్.. అస్సలు ఊహించలేదుగా..

Sampoornesh Babu first look Release from 'The Paradise' movie

Updated On : December 19, 2025 / 7:56 PM IST

The Paradise: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. ఈ పేరు వింటే మనకు హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి కామెడీ చిత్రాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ, ఇక నుంచి సంపూర్ణేష్ బాబు అంటే మాత్రం పక్కా వైలెంట్ పత్రాలు గుర్తుకు రావడం ఖాయం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే ది పారడైజ్(The Paradise) మూవీ నుంచి తాజాగా విడుదలైన సంపూర్ణేష్ బాబు లుక్ గా చెప్పుకోవచ్చు. నేచురల్ స్టార్ నాని హీరోగా ది పారడైజ్ అనే పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Nidhi Agarwal: నిధి పాప అందాలకు నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు

ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాని, మోహన్ బాబు లుక్స్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో కీలక పాత్రకు సంబందించిన పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అదే సంపూర్ణేష్ బాబు లుక్. ఈ సినిమాలో సంపూర్ణేష్ బిర్యానీ అనే పాత్రలో కనిపిస్తాడు అంటూ ఆయన పోస్టర్ విడుదల చేశారు. చేతిలో ఇనుప అయిదం, మరో చేతిలో సిగరెట్, మొహానికి రక్తంతో చాలా వైలెట్ లుక్ లో కనిపిస్తున్నాడు సంపూ.

అసలు ఊహించని రేంజ్ లో ఈ లుక్ ఉండటంతో ఆడియన్స్ అవాక్కవుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాలో ఆయన పాత్ర నెక్స్ట్ లెవల్లో ఉండబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే, ఇంతకాలం కేవలం కామెడీ చిత్రాలకే పరిమితం అయినా సంపూ ఈ సినిమాతో తనలోని మరోకోణాన్ని ఆడియన్స్ కి పరిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.