Ind vs Pak at UNSC: పాకిస్తాన్ వ్యాఖ్యలపై స్పందించడం కూడా దండగేనన్న ఇండియా

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం పాకిస్తాన్‭కు ఇది కొత్తేం కాదు. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్పటి నుంచి ఇరు దేశాల (భారత్-పాక్) మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి

Ind vs Pak at UNSC: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి సందర్భ శుద్ధి లేకుండా అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ ప్రస్తావన లేవనెత్తి భంగపాటుకు గురైంది. భారత్ చేతిలో చీవాట్లు తిన్నది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళలు, శాంతి, భద్రత’ అనే అంశంపై భద్రతా మండలిలో ఏర్పాటు చేసిన ఐరాస సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందిస్తూ కశ్మీర్ అంశాన్ని వెలికి తీశారు. అయితే సమయ సందర్భం చూసుకోకుండా పాక్ వ్యాఖ్యల్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా పాక్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడం కూడా దండగేనని అన్నారు.

Delhi Liquor Scam: అందుకే కవితకు నోటీసులు పంపారు: తెలంగాణ మంత్రుల ఆగ్రహం

‘‘పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి. రాజకీయంగా ప్రేరేపించబడినవి కూడానూ. నా ప్రసంగం ముగించే ముందు జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ధ్వేషపూరితమైన వ్యాఖ్యలపై స్పందించడం కూడా దండగేనని అనుకుంటున్నాను’’ అని అన్నారు.

Tamilnadu: బీజేపీని చావు దెబ్బ కొడుతున్న మిత్రపక్షం.. వరుస పెట్టి కమల నేతల్ని టార్గెట్ చేసిన అన్నాడీఎంకే.. తాజాగా 13 మంది లీడర్లు జంప్

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం పాకిస్తాన్‭కు ఇది కొత్తేం కాదు. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్పటి నుంచి ఇరు దేశాల (భారత్-పాక్) మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణను భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో ఎత్తివేయడంతో ఈ పరిస్థితులు మరింత పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు