Tamilnadu: బీజేపీని చావు దెబ్బ కొడుతున్న మిత్రపక్షం.. వరుస పెట్టి కమల నేతల్ని టార్గెట్ చేసిన అన్నాడీఎంకే.. తాజాగా 13 మంది లీడర్లు జంప్

కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేశాను. నాకు పార్టీలో ఎలాంటి పదవి కావాలని నేనెప్పుడూ ఆశ పడలేదు. ఆ విషయం పార్టీలో ఉన్నవారికి కూడా బాగా తెలుసు. కానీ కొద్ది రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అందుకే నేను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నాను

Tamilnadu: బీజేపీని చావు దెబ్బ కొడుతున్న మిత్రపక్షం.. వరుస పెట్టి కమల నేతల్ని టార్గెట్ చేసిన అన్నాడీఎంకే.. తాజాగా 13 మంది లీడర్లు జంప్

Big shock to BJP.. 13 BJP leaders quit party in Tamil Nadu

Tamilnadu: రెండ్రోజుల క్రితమే తమిళనాడు రాష్ట్ర సోషల్ మీడియా చీఫ్ కోల్పోయి ఉన్న భారతీయ జనతా పార్టీకి తాజాగా మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 13 మంది నాయకులు పార్టీని వీడారు. వీరంతా బీజేపీ మిత్రపక్షమైన ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడీఎంకే)లో చేరారు. వీరంతా బీజేపీ ఐటీ వింగ్‭కు చెందిన నాయకులు. ఏఐడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఉద్దేశపూర్వకంగా బీజేపీ నేతల్ని తమ పార్టీలో చేర్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

ఈ విషయమై బీజేపీని వీడిన తమిళనాడు బీజేపీ ఐటీ వింగ్ ప్రతినిధి అంరసన్ స్పందిస్తూ ‘‘కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేశాను. నాకు పార్టీలో ఎలాంటి పదవి కావాలని నేనెప్పుడూ ఆశ పడలేదు. ఆ విషయం పార్టీలో ఉన్నవారికి కూడా బాగా తెలుసు. కానీ కొద్ది రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అందుకే నేను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నాను’’ అని తెలిపారు. ఒక జిల్లా ఐడీ వింగ్ అధ్యక్షుడు, పది మంది ఐటీ వింగ్ జిల్లా సెక్రెటరీలు, ఇద్దరు ఐటీ వింగ్ జిల్లా డిప్యూటీ సెక్రెటరీలు పార్టీని వీడారు.

Delhi Liquor Scam..MLC Kavitha : విచారణకు రేపు రాలేను..15 తరువాతే వస్తా.. అంటూ ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ

వీరికి ముందు కొంత మంది బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీని వీడారు. వారంతా ఏఐడీఎంకేలో చేరారు. ఇక వీరితో పాటు బీజేపీ ఇంటలెక్చువల్ వింగ్ స్టేట్ సెక్రెటరీ క్రిష్ణన్, ఐటీ వింగ్ స్టేట్ సెక్రెటరీ దిలీప్ కన్నన్, ట్రిచీ రూరల్ వైస్ ప్రెసిడెంట్ విజయ్, స్టేట్ ఓబీసీ వింగ్ సెక్రెటరీ అమ్ము కూడా బీజేపీని వీడి ఏఐడీఎంకేలో చేరారు. రాష్ట్ర బీజేపీ ఐటీ వింగ్ చీఫ్ నిర్మల్ కుమార్ రాజీనామా చేసి ఏఐడీఎంకేలో చేరిన అనంతరమే ఇంత పెద్ద మొత్తంలో పార్టీని వీడడం గమనార్హం. వీరంతా పార్టీని వీడడానికి కారణం తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలై వ్యవహార శైలిని కారణంగా చూపిస్తున్నారు.