Delhi Liquor Scam: అందుకే కవితకు నోటీసులు పంపారు: తెలంగాణ మంత్రుల ఆగ్రహం

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. కవితకు ఈడీ నుంచి నోటీసులు అందడాన్ని కేంద్ర సర్కారు పాల్పడుతున్న చర్యలకు పరాకాష్ఠగా మంత్రి జగదీశ్ రెడ్డి అభివర్ణించారు.

Delhi Liquor Scam: అందుకే కవితకు నోటీసులు పంపారు: తెలంగాణ మంత్రుల ఆగ్రహం

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. కవితకు ఈడీ నుంచి నోటీసులు అందడాన్ని కేంద్ర సర్కారు పాల్పడుతున్న చర్యలకు పరాకాష్ఠగా మంత్రి జగదీశ్ రెడ్డి అభివర్ణించారు.

రాజకీయ దురుద్దేశంతోనే నోటీసులు పంపారని చెప్పారు. కేంద్ర సర్కారు తీరును నిలదీస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం పోరాడే వారి గొంతు నొక్కడానికే కుట్ర పన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అభివృద్ధి పనులు చేయలేకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. తాము దేశమంతా ఉద్యమించి, బీజేపీ తీరును ఎండగడతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

బీజేపీ బెదిరింపులకు భయపడబోమని పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. విద్వేషపూరిత రాజకీయాలు పరాకాష్టకు చేరాయని మంత్రి నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. కాగా, ఇప్పటికే కవితను సీబీఐ విచారించింది. రేపు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కవితను ఈడీ ఆదేశించింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Delhi Liquor Scam: కవితకు ఈడీ నోటీసులు పంపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ తీవ్ర ఆగ్రహం