Global Cyber Security Index : పదో ర్యాంకులో భారత్.. చైనా 33, పాక్ 79

గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సూచీ (Global Cyber Security Index)లో భారత్ పదో ర్యాంకులో నిలిచింది. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్.. తన ర్యాంకును మరింతగా మెరుగుపర్చుకుని పదవ ర్యాంకులో నిలిచింది.

Global Cyber Security Index : పదో ర్యాంకులో భారత్.. చైనా 33, పాక్ 79

India Jumps To No.10 On Global Cyber Security Index

Updated On : June 30, 2021 / 8:10 AM IST

Global Cyber Security Index : గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సూచీ (Global Cyber Security Index)లో భారత్ పదో ర్యాంకులో నిలిచింది. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్.. తన ర్యాంకును మరింతగా మెరుగుపర్చుకుని పదవ ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత డ్రాగన్ చైనా 33వ ర్యాంకు, దయాది పాకిస్థాన్ 79వ ర్యాంకుల్లో పరిమితమైనట్టు ఐక్యరాజ్య సమితి (UN) అధ్యయనంలో వెల్లడైంది.

అంతర్జాతీయ శాంతి, సైబర్ భద్రతపై యుఎన్ భద్రతా మండలి చర్చలో విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా మాట్లాడారు. ప్రపంచ దేశాల మధ్య డిజిటల్ అంతరాలు సైబర్ డొమైన్‌లో అస్థిరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని ఆయన అన్నారు. కరోనా అనంతర కాలంలో పెరుగుతున్న డిజిటల్ పరంగా సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైబర్ డొమైన్ ఉగ్రవాద దోపిడీ వంటి సమస్యలు మరింత వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని విదేశాంగ కార్యదర్శి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. డిజిటల్ సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారానే ఈ అంతరాలను తగ్గించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదులు తమ భావజాలాన్ని ప్రచారం చేయడంతోపాటు విద్వేషాలను ప్రేరేపించేందుకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీపై ఐక్యరాజ్యసమితి మొట్టమొదటి అధికారిక బహిరంగ సభను నిర్వహించింది.. సైబర్ దాడులను ఎదుర్కోవడంలో ఐరాస సభ్య దేశాలన్నీ ఒకరికొకరు సహకారం అందించుకోవాలని 2015లోనే తీర్మానించుకున్నట్టు పేర్కొన్నారు.