India Maldives Row : మరింత ముదిరిన మాల్దీవ్స్ వివాదం.. భారత్ మాల్దీవుల మధ్య పెరుగుతున్న అగాథం

భౌగోళికంగా చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించడం తగదని, అందుకు ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదంటూ కామెంట్ చేశారు.

India Maldives Controversy

India Maldives Row : భారత్ మాల్దీవుల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. భారత సైన్యాన్ని వెనక్కి పిలవాలంటూ మాల్దీవుల ప్రభుత్వం కోరింది. మార్చి 15 నాటికి మాల్దీవుల నుంచి ఇండియన్ ఆర్మీని ఉపసంహరించుకోవాలని అభ్యర్థించింది. మాల్దీవుల అభ్యర్థనపై ఇరు దేశాల అధికారులు మాల్యాలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశం అయ్యారు. మాల్దీవుల అభ్యర్థనపై చర్చించారు. మార్చి 15 నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలంటూ తమ అధ్యక్షుడు చెప్పినట్లుగా సమావేశంలో పాల్గొన్న మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్ కు తెలిపారు.

దీంతో పాటు భారత్ తో చేసుకున్న ద్వైపాక్షిక సంబంధాలను కూడా సమీక్షిస్తున్నట్లు ఆ దేశ వ్యవహారాల మంత్రి వెల్లడించారు. గతంలో మానవతా అవసరాల కోసం భారత్ ఇచ్చిన రెండు హెలికాప్టర్ల వినియోగం ఆపేయాలంటూ అధ్యక్షుడు మహ్మద్ ముయిజు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 77మంది భారత సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు.

Also Read : ప్రియురాలి కోసం గెట‌ప్ మార్చావు స‌రే.. అస‌లు విష‌యం మ‌రిచిపోయావుగా..!

గత ఏడాది నవంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ ముయిజు భారత్ ను కోరారు. ఇక ముయిజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనా పర్యటనకు వెళ్లి డ్రాగన్ దేశంతో పలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మూడు రోజుల కింద స్వదేశానికి వచ్చాక ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించడం తగదని, అందుకు ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదంటూ కామెంట్ చేశారు.

 

Also Read : అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు.. అక్కడ ఒక్కో రూం ధర 85వేలుపైమాటే