Ram Mandir Inauguration : అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు.. అక్కడ ఒక్కో రూం ధర 85వేలుపైమాటే

రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ లు భారీగా పెరిగాయి. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖులు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Ram Mandir Inauguration : అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు.. అక్కడ ఒక్కో రూం ధర 85వేలుపైమాటే

Ayodhya

Ayodhya Hotel Bookings : శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలోని రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది. ఈ మహత్తర ఆధ్యాత్మిక ఘట్టంకోసం దేశ వ్యాప్తంగానేకాక.. ప్రపంచ వ్యాప్తంగాఉన్న హిందువులు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనను నేరుగా తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 7వేల మంది అతిథులుగా రాబోతున్నారు.ఈ క్రమంలో అయోధ్య, దానిపరిధిలోని 170 కిలో మీటర్ల దూరంలో ఉన్న పట్టణాల్లో హోటళ్లలోసైతం రూంలకు భారీ డిమాండ్ పెరిగింది.

Also Raed : Ayodhya Ram Mandir : మెగా ఫ్యామిలీకి రామ మందిర ఆహ్వానం.. చిరు, చరణ్ దంపతులు అయోధ్యకు..

రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ లు భారీగా పెరిగాయి. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖులు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లో హోటళ్లలో రూమ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు హోటళ్లలో నో అవెలబుల్ రూమ్స్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. అయోధ్యకు 170 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్నో, ప్రయాగ్ రాజ్, గోరఖ్ పూర్ వంటి ప్రాంతాల్లోనూ హోటళ్లకు యమ డిమాండ్ పెరిగింది. సిగ్నెట్ హోట్సల్ అండ్ రిసార్ట్స్ వ్యవస్థపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. మా హోటల్స్ నెల మొత్తానికి రూంలు బుక్ అయ్యాయి. సగటు రోజువారీ రేటు చాలా ఎక్కువ ఉంది. ఇది రూ. 85వేలకు చేరుకుందని తెలిపారు. సిగ్నెట్ కలెక్షన్ కెకె హోటల్ ప్రముఖుల కోసం, ఆలయ ట్రస్ట్ కు 45శాతం గదులను కేటాయించింది.

అయోధ్యలో ప్రస్తుతం జనావాసాల ప్రాంతంలో 50హోంలు ఉన్నాయి. వీటిలో మొత్తం వెయ్యి గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే, త్వరలో అవి అమ్ముడవుతాయని భావిస్తున్నట్లు ఓయో చీఫ్ మర్చట్ ఆఫీసర్ తెలిపారు. వీటికి లక్నో కనెక్టివీటీ సహాయ పడుతుంది. అయితే, వాటిని అందరికీ అందుబాటులో ఉంచడానికి మేం ప్రయత్నిస్తున్నాం.. కానీ, ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.

Also Read : Ayodhya Ram Mandir : రామమందిర ప్రారంభ ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు…ఏం ఇస్తారంటే…

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. లక్నోలో 24 ప్రముఖ హోటళ్లు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతర్జాతీయ విమానాశ్రయం, రోడ్డు, రైలు మార్గాలకు, భారతదేశంలోని ప్రధాన నగరాలకు అందుబాటులో ఉంటుంది. జనవరి 21-23, జనవరి 29-30 మధ్య తాజ్ మహాల్ లక్నో బుకింగ్ .కామ్ లో రూంలు అందుబాటులో లేవు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఒక్క గది రూ.65,339తో బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇవికూడా త్వరలోనే పూర్తవుతాయని బుకింగ్.కాం పేర్కొంది. రినాస్సాన్స్ లక్నో హోటళ్లలో ఒక్కో గది జనవరి 22న ఒక్కరోజుకు బుకింగ్.కామ్ లో రూ. 42,224కు అందుబాటులో ఉంది. లెమన్ ట్రీ హోటల్ లక్నోలో జనవరి 22వ తేదీకి ఒక్కరోజుకు రూ. 24,687 కు రూంలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు గోరఖ్ పూర్, ప్రయాగ్ రాజ్ లోని హోటళ్లు వేగంగా బుక్ అవుతున్నాయి. అయితే, ఈ రెండు పట్టణాలకు యూపీ రాజధానికి కనెక్టివిటీ తక్కువగా ఉంటుంది.

అయోధ్యలో ఉండటానికి తగిన లగ్జరీ హోటల్స్ అందుబాటులో లేవు. కేవలం రెండు మూడు మాత్రమే ఉన్నాయి. అందులోనూ 150కంటే తక్కువ గదులు ఉన్నాయి. లక్నో అయోధ్యకు 140 కిలో మీటర్ల దూరంలో ఉండటం, అక్కడ అన్ని వసతులు ఉండటంతో లక్నో హోటల్స్ లో ఉండేందుకు అధికమంది ప్రాధాన్యత ఇస్తున్నారు.