Ayodhya Ram Mandir : రామమందిర ప్రారంభ ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు…ఏం ఇస్తారంటే…

పవిత్ర అయోధ్య నగరంలో రామమందిర శంకుస్థాపన ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 22వతేదీన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించిన విశిష్ట అతిథులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్ట్ ప్రకటించింది....

Ayodhya Ram Mandir : రామమందిర ప్రారంభ ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు…ఏం ఇస్తారంటే…

Ayodhya Ram Mandir

Updated On : December 28, 2023 / 6:29 AM IST

Ayodhya Ram Mandir : పవిత్ర అయోధ్య నగరంలో రామమందిర ప్రారంభ ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 22వతేదీన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించిన విశిష్ట అతిథులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానితులకు పవిత్ర ప్రసాదంతో పాటు, గీతా ప్రెస్ నుంచి ‘అయోధ్య దర్శన్’ పుస్తకం కాపీలను ఇస్తామని తెలిపింది.

ALSO READ : Bus Catches Fire : బస్సులో చెలరేగిన మంటలు…13మంది మృతి, మరో 17 మందికి గాయాలు

దీని కోసం అయోధ్య దర్శన్ 10వేల కాపీలను ముద్రించారు. అయోధ్య దర్శనం పుస్తకంలో అయోధ్య నగరం గురించిన సమగ్ర సమాచారం, దాని చరిత్ర, ప్రాచీన ప్రాముఖ్యత, రామాయణానికి సంబంధించిన అధ్యాయాలు, ఆలయాల గురించిన వివరాలు ఉన్నాయి. ఈ పుస్తకం ముఖచిత్రంగా లార్డ్ రామ్, రామ మందిరం ఉన్నాయి. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యే అతిథులందరికీ అయోధ్య దర్శనం పుస్తకాన్ని అందజేయనున్నారు. ఎంపిక చేసిన కొంతమంది ప్రముఖ అతిథులకు మూడు అదనపు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

ALSO READ : Ayodhya Ram Temple Doors : అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు, వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా తయారీ

100 మంది అతిథులకు అయోధ్య మహాత్మ్యం, ‘గీత దైనందిని’ (గీతా డైరీ), శ్రీరాముడిపై కథనం ఉన్న కల్యాణ్ పాత్ర మ్యాగజైన్ ప్రత్యేక సంచికను బహుమతిగా అందజేయనున్నారు. కల్యాణ్ పత్రిక ప్రత్యేక సంచిక 1972వ సంవత్సరంలో మొదటిసారిగా ప్రచురించారు. అయోధ్య వైభవానికి సంబంధించిన పలు కథనాలతో కూడిన అయోధ్య మహాత్మ్య పుస్తకాన్ని కూడా గీతా ప్రెస్ అందజేయనుంది.

ALSO READ : Group 2 Exam : నిరుద్యోగులకు మరోసారి నిరాశ.. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా

ఆర్ట్ పేపర్‌పై 45 పేజీల ప్రింటెడ్ ఇలస్ట్రేషన్‌లతో ఈ పుస్తకం పాఠకులకు విజువల్ ట్రీట్ కానుంది. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే, గీతా ప్రెస్ ఇంగ్లీషు, హిందీ తేదీలతో పాటు భగవద్గీతలోని శ్లోకాలతో కూడిన గీత దైనందిని డైరీని అందజేస్తుంది. డైరీలో ఉపవాసం, పండుగలు, సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల గురించిన వివరాలు ఉంటాయి.