Group 2 Exam : నిరుద్యోగులకు మరోసారి నిరాశ.. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా

జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ. కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంది.

Group 2 Exam : నిరుద్యోగులకు మరోసారి నిరాశ.. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా

TSPSC Group 2 Exam 2023 Postponed

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడగా ముచ్చటగా మూడోసారి పోస్ట్ పోన్ అయ్యింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ. కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంది.

పేపర్ లీక్ కారణంగా గతంలో ఒకసారి గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా రెండోసారి వాయిదా పడింది. కొత్త ఏడాదిలో జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, తాజాగా మరోసారి పరీక్ష వాయిదా పడింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ తో పాటు గ్రూపు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాల్సి వచ్చింది.

Also Read : పవన్ కల్యాణ్ వేట.. గెలుపు గుర్రాల ఎంపిక కోసం స్వయంగా రంగంలోకి, ముందుగా అక్కడి నుంచే

ఈ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించేందుకు పరిస్థితులు లేవంటూ మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేశారు. ఈ మేరకు టీఎస్ పీఎస్ సీ ప్రకటన చేసింది. గ్రూప్ 2 పోస్టులకు 5లక్షల 50వేల మంది అప్లయ్ చేసుకున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6, 7వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, టీఎస్‌పీఎస్ సీ ఛైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను తొందరలోనే చెబుతామంది.

రాష్ట్రంలో గ్రూప్‌ -2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1 తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్‌ -2 ఉద్యోగమే కావడంతో 5,51,943 మంది దరఖాస్తు చేశారు.

సగటున ఒకో ఉద్యోగానికి 705 మంది పోటీపడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు నవంబర్ 2, 3వ తేదీలకు పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు.

Also Read : అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి?

ఇంతలో నవంబర్‌ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణ, శాంతిభద్రతలు, వసతులు, సిబ్బంది అన్నీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని కలెక్టర్లు టీఎస్‌పీఎస్సీ దృష్టికి తెచ్చారు. అన్నీ ఆలోచించిన టీఎస్‌పీఎస్సీ తప్పని పరిస్థితుల్లో రెండోసారి గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గ్రూప్‌-2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్‌ కాగా.. తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది.