Ayodhya Ram Temple Doors : అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు, వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా తయారీ

అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతోపాటు మొత్తం 118 ద్వారాలకు తలుపులు తయారు చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్ డిపో. ఆరేడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు.

Ayodhya Ram Temple Doors : అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు, వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా తయారీ

Ayodhya Ram Temple Doors Made in Hyderabad

అయోధ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆలయ నిర్మాణానికి వాడుతున్న ప్రతి వస్తువుకు ప్రత్యేక ఉంది. రామ మందిర నిర్మాణంలో వాడుతున్న ఇటుకలు మొదలుకొని రాముని విగ్రహాల వరకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులనే వాడుతున్నారు. అయితే రాముని ఆలయంలోని ద్వారాలకు బిగించే తలుపులను తయారు చేసే అరుదైన అవకాశం మాత్రం హైదరాబాద్‌కు చెందిన టింబర్ డిపోకి దక్కింది. అంటే అయోధ్యలో రాముడి గుడికి హైదరాబాద్‌ కంపెనీ తయారు చేసిన తలుపులను అమర్చనున్నారు. ఆ అరుదైన అవకాశం హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్‌ డిపోకి దక్కడంలో ఆరేడు నెలలుగా ఆ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి.

118 ద్వారాలకు తలుపులు తయారీ..
దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న రామాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. భవ్య రామ మందిరం నిర్మాణం పనులు, ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణగా అయోధ్య రామ మందిరం తలుపులు చోటు దక్కించుకొనున్నాయి. అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతోపాటు మొత్తం 118 ద్వారాలకు తలుపులు తయారు చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్ డిపో. ఆరేడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు.

Also Read : కేబీసీ మొదటి రూ.5కోట్ల విజేత టీచర్ అయ్యారు

యాదగిరిగుట్ట ఆలయానికి కళాకృతులు అందించిన అనుభవం..
తెలంగాణ తమిళనాడుకు చెందిన వర్కర్స్ ఇందులో పని చేస్తున్నారు. ఇతర కంపెనీలు రామ మందిరం నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చినా.., దేశంలోనే బెస్ట్ కంపెనీగా గుర్తింపు పొందిన అనురాధ టింబర్ డిపోను ఎంపిక చేసింది అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వివిధ కళాకృతులు అందించిన అనుభవం ఉండటంతో అనురాధ టింబర్ డిపోకు అవకాశం ఇచ్చారు. యాదగిరిగుట్ట తో పాటు రాష్ట్రంలోని అనేక ఆలయాలకు తలుపులు చేసిన అనుభవం ఉండటమే దీనికి ప్రధాన కారణమని అనురాధ టింబర్ డిపో డైరెక్టర్ చదలవాడ శరత్ బాబు చెప్పారు.

వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా తలుపుల తయారీ
ప్రధాన ద్వారం ఎత్తు 8 అడుగులు, వెడల్పు 12 అడుగులు ఉంటుంది. దీనితో పాటు మరొక 118 ద్వారాలకు కూడా తలుపులు తయారు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 18 ద్వారాలకు బంగారు తాపడంతో తలుపులు చేస్తున్నట్లుగా వెల్లడించారు శరత్ బాబు. మరో వెయ్యేండ్ల పాటు ఈ తలుపులు చెక్కుచెదరకుండా ఉండేలా మహారాష్ట్ర చెందిన నాణ్యమైన బల్లర్ష టేకును వాడుతున్నారు. జనవరిలోనే ఆలయ ప్రారంభోత్సవం ఉండటంతో యుద్ధప్రాతిపదికన ద్వారాలు, తలుపులు చేసే పనులు చేస్తున్నారు.