Ayodhya Ram Mandir : మెగా ఫ్యామిలీకి రామ మందిర ఆహ్వానం.. చిరు, చరణ్ దంపతులు అయోధ్యకు..

ఆయా సెలబ్రిటీలను రామమందిర ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆహ్వానం మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి కూడా అందింది.

Ayodhya Ram Mandir : మెగా ఫ్యామిలీకి రామ మందిర ఆహ్వానం.. చిరు, చరణ్ దంపతులు అయోధ్యకు..

Megastar Chiranjeevi and Ram Charan Receives Ayodhya Ram Mandir Opening Ceremony

Updated On : January 13, 2024 / 7:56 PM IST

Ayodhya Ram Mandir : దేశమంతా ఎంతో ఆతృతగా అయోధ్య రామ మందిర ప్రారంభానికి ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్ళ కల సాకారం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం, అయోధ్య ట్రస్ట్, హిందూ ధార్మిక సంస్థలు రాముని ఆగమనాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. జనవరి 22న రామ ప్రతిష్టాపన ఘనంగా జరగనుంది. దేశం నలుమూలల జై శ్రీరామ్ అంటూ సంబరాలు జరగనున్నాయి.

ఈ మహత్తర కార్యక్రమానికి దేశంలోని పలు రంగాలలో ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. అన్ని భాషల సినీ రంగంలో కూడా చాలా మందికి ఆహ్వానాలు అందాయి. విశ్వహిందూ పరిషత్ స్వయంగా వచ్చి ఆయా సెలబ్రిటీలను రామమందిర ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆహ్వానం మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి కూడా అందింది.

Also Read : Hanuman : అమెరికాలో ‘హనుమాన్’ హవా.. తేజ సజ్జ మొదటి రికార్డ్..

మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) కూడా విశ్వహిందూ పరిషత్ నాయకులు స్వయంగా కలిసి ఈ ఆహ్వానాన్ని అందించారు. చిరంజీవి కూడా సతీసమేతంగా అయోధ్యకు హాజరవుతానని, ఈ ఆహ్వానం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రామ్ చరణ్(Ram Charan) దంపతులకు కూడా అయోధ్య ఆహ్వానాన్ని అందించారు. చరణ్, చిరు ఫ్యామిలీతో సహా జనవరి 22న అయోధ్యకు హాజరు కానున్నారు. సినీ పరిశ్రమలో ఇంకా పలువురికి ఆహ్వానాలు వెళ్లనున్నట్టు సమాచారం.