భారత్-పాక్ లు సంయమనం పాటించాలి : బ్రిటన్ ప్రధాని

భారత్-పాక్ లమధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. రెండు దేశాలతో తాము రెగ్యులర్ గా సంప్రదింపులు జరుపుతున్నామని ఆమె అన్నారు. శాంతి స్థాపన కోసం చర్చలు, దౌత్యపరిష్కారం ద్వారా చర్యలు చేపట్టాలన్నారు. అంతర్జాతీయ భాగస్వాములతో తాము చర్చిస్తున్నామని, ఆందోళనకర పరిస్థితులను నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి భధ్రతా మండలితో కూడా ద్వారా కూడా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్-పాక్ రెండు దేశాల మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. బ్రిటీష్ పౌరులకు సంబంధించిన చిక్కులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.