Indian American Gautam Raghavan Elevated To Key White House Post
Gautam Raghavan : భారతీయ అమెరికన్ గౌతమ్ రాఘవన్‌కు యూఎస్ వైట్‌హౌజ్‌లో కీలక పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారతీయ సంతతికి చెందిన రాఘవన్‌కు కీలక బాధ్యతలను అప్పగించారు. అమెరికా పాలసీ అడ్వైజర్‌గా పనిచేస్తున్న గౌతమ్ రాఘవన్‌కు.. వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ అధిపతిగా నియమించారు. వైట్‌హౌజ్ పీపీఓను ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ గా వ్యవహరిస్తారు. వైట్‌హౌజ్‌లో జరిగే కొత్త నియామకాలపై పీపీవో ఆఫీసు పరిశీలిస్తుంటుంది. ఇక్కడ పనిచేసే అభ్యర్థలను పీపీవో ఆఫీసు నియమిస్తుంటుంది. గౌతమ్ రాఘవన్ ప్రస్తుతం పీపీవో డిప్యూటీ డైరక్టర్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలో UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ UNICEF తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కాథీ రస్సెల్‌ను నియమించాలని ప్రకటించారు.
అధ్యక్షుడు బైడెన్ కూడా రాఘవన్‌కు కీలకమైన వైట్ హౌస్ పదవిని అప్పగిస్తన్నట్టు ప్రకటించారు. రస్సెల్ పోస్టుకు రాఘవన్‌ను బైడెన్ ప్రమోట్ చేశారు. రస్సెల్ ప్రస్తుతం WH PPO అధిపతిగా ఉన్నారు. కాథీ నేతృత్వంలో వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ (PPO) నియామకాలను జరుపుతారు. మొదటి రోజు నుంచి క్యాథీతో కలిసి పనిచేసిన గౌతమ్ రాఘవన్ PPO కొత్త డైరెక్టర్‌గా మారడం నాకు చాలా సంతోషంగా ఉందని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ జనరేషన్ మైగ్రేటర్ అయిన రాఘవన్ భారత్‌లో జన్మించాడు. పెరిగింది మాత్రం సియాటిల్‌లో.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు.
వెస్ట్ వింగర్స్: స్టోరీస్ ఫ్రమ్ ది డ్రీమ్ ఛేజర్స్, చేంజ్ మేకర్స్, అండ్ హోప్ క్రియేటర్స్ ఇన్‌సైడ్ ది ఒబామా వైట్ హౌస్‌కి సంపాదకుడు కూడా. గౌతమ్ రాఘవన్ ప్రెసిడెంట్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా జనవరి 20, 2020 నుంచి పనిచేశారు. గతంలో బైడెన్-హారిస్ ట్రాన్సిషన్ టీమ్ ద్వారా ప్రెసిడెన్షియల్ డిప్యూటీ హెడ్‌గా పనిచేసిన మొదటి ఉద్యోగి కూడా రాఘవనే కావడం విశేషం. రాఘవన్ వయసు 40 ఏళ్లు పైబడి ఉంటాయి. రాఘవన్ స్వలింగ సంపర్కుడు. ఆయన భర్త, కూతురితో కలిసి వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు.
Read Also : Manchu Lakshmi : కేరళ ప్రాచీన విద్యతో అదరగొడుతున్న మంచు లక్ష్మి… వైరల్ అవుతున్న వీడియోలు