దుస్సాహసం: నేపాల్ బలగాల కాల్పులు, భారతీయుడి మృతి, ముగ్గురికి గాయాలు

నేపాల్ రక్షణ బలగాలు నేపాల్ సరిహద్దు నుంచి జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడటంతో పాటు ఓ ఇండియన్ చనిపోయాడు. బీహార్, సీతామారి జిల్లా సరిహద్దులో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన వెనుక కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. ఇరు దేశాల సరిహద్దు రక్షణ బలగాలు మరికొద్ది రోజుల్లో మీటింగ్ కానున్నాయి.
ఇండియా-నేపాల్ ల మధ్య లిపులేఖ్-కాలాపానీ-లింపియాధురా ప్రాంతం గురించి జరుగుతున్న వాదనలు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇండియా లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమవేనంటూ చెప్తుంది. అదే సమయంలో నేపాల్ కూడా తమకు చెందినవేనంటూ వాదనకు దిగుతుంది.
గత వారం నేపాల్ ప్రభుత్వం ప్రతినిధులతో అమెండ్‌బిల్లు ఆమోదంపై చర్చలు జరిపింది. జాతీయ చిహ్నంతో పాటు రాజకీయపరమైన సరిహద్దులకు సంబంధించి మ్యాప్ లో మార్పులు చేయాలని నిర్ణయించారు.