Rajnath Singh Gifted Horse By Mongolian President,
Minister Rajnath Singh : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగోలియాలో పర్యటిస్తున్నారు. మంగోలియాలో పర్యటించిన భారత్ తొలి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక్కరే కావటం విశేషం. మంగోలియా పర్యటనలో ఉన్న మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంగోలియా అధ్యక్షుడు ఉఖ్‌నాగిన్ కురేల్‌సుక్ తెల్లటి గుర్రాన్ని బహూకరించారు. కురేల్‌సుక్ తనకు గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు.
మంగోలియా నుంచి ప్రత్యేక స్నేహితుల నుంచి ప్రత్యేక గిఫ్ట్ వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ గుర్రానికి తేజస్ అని పేరు పెట్టినని తెలిపారు. ఈ క్రమంలో అధ్యక్షుడు కురేల్‌సుక్‌కు థ్యాంక్స్ తెలిపారు. పర్యటన సందర్భంగా మంగోలియా అధ్యక్షుడితో వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. సెప్టెంబరు 5 నుండి 7 వరకు రాజ్‌నాథ్‌సింగ్ మంగోలియా పర్యటించనున్నారు. భారత రక్షణ మంత్రి తూర్పు ఆసియా దేశానికి పర్యటించడం ఇదే మొదటిసారి.