అమెరికాలో అదృశ్యమైన భారతీయ అమ్మాయిని ఎట్టకేలకు గుర్తించిన పోలీసులు

Missing case: హైదరాబాద్‌ విద్యార్థి మృతి ఘటన మరవక ముందే మరో అమ్మాయి ఇదే రీతిలో అదృశ్యం కావడం కలకలం రేపింది.

అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి మహ్మద్‌ అబ్దుల్‌ అరాఫత్‌ మృతి ఘటన మరవక ముందే మరో అమ్మాయి ఇదే రీతిలో అదృశ్యం కావడం కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి లొకేషన్‌ను కొందరి సాయంతో పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఇషికా ఠాకూర్ (17) అనే అమ్మాయి సోమవారం అదృశ్యమైంది. ఆమె చివరిసారిగా అదే రోజు రాత్రి ఫ్రిస్కోలోని బ్లాక్ ఆఫ్ బ్రౌన్‌వుడ్ వద్ద కనపడింది. ఆ తర్వాత ఆమె ఎటు వెళ్లిందో తెలియలేదు. ఆమె దాదాపు 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉంటుంది.

అదృశ్యమైన సమయంలో బ్లాక్, పొడవాటి స్లీవ్ టీ-షర్ట్, రెడ్/గ్రీన్ పైజామా ప్యాంటు వేసుకుంది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. చివరకు ఆమెను ఇవాళ ఓ ప్రాంతంలో గుర్తించినట్లు, ఆమె సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆమెను గుర్తించడంలో సాయపడ్డ వారికి కృతజ్ఞతలు చెబుతున్నామని పోలీసులు ట్వీట్ చేశారు. అమెరికాలో ఇటీవల కొందరు భారతీయ విద్యార్థులు అదృశ్యమై మృతి చెందిన ఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌ విద్యార్థి మహ్మద్‌ అబ్దుల్‌ అరాఫత్‌ మృతదేహాన్ని పోలీసులు క్లీవ్‌లాండ్‌లోని ఒహాయోలో ఓ సరస్సు వద్ద గుర్తించిన విషయం తెలిసిందే.

Also Read : సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత గాంధీమ‌తి బాల‌న్ క‌న్నుమూత‌

ట్రెండింగ్ వార్తలు