Gandhimathi Balan : సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత గాంధీమ‌తి బాల‌న్ క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది

Gandhimathi Balan : సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత గాంధీమ‌తి బాల‌న్ క‌న్నుమూత‌

Gandhimathi Balan

Gandhimathi Balan passes away : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ సినీ నిర్మాత గాంధీమ‌తి బాల‌న్‌ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 66 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణంతో మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ శోకసంద్రంలో మునిగిపోయింది.

1980ల్లో అగ్ర‌నిర్మాత‌ల్లో గాంధీమ‌తి బాల‌న్ ఒక‌రు. గాంధీమ‌తి పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించారు. ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ఎన్నో చిత్రాల‌ను ఆయ‌న నిర్మించారు. మూన్నం పక్కం, నంబరతి పూవు, ఈ తనుత వేలుప్పన్ కలతు, పథముదయం, సుఖమో దేవి, ఇదిరి నేరం ఒత్తిరి కార్యమ్ చిత్రాలను ఆయ‌న నిర్మించారు.

Devara : అప్పుడు బాహుబలి.. ఇప్పుడు దేవర.. హిందీ థియేట్రికల్ రైట్స్‌ని దక్కించుకున్న బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ..

దాదాపు 33 సినిమాల‌ను నిర్మించారు. ప‌లు చిత్రాల్లో న‌టించారు. ఆడమింటే వారియెల్లు వంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇరాకల్, థూవనతుంబికల్, మాలూట్టి మరియు మణివత్తూరిలే ఆయిరం శివరాత్రికళ్ పంపిణీదారుగా, మలయాళ సినిమా చరిత్రలో గాంధీమతి ఫిల్మ్స్ వారసత్వాన్ని సుస్థిరం చేసింది.

కొన్ని సంవత్సరాల క్రితం ఆయ‌న త‌న కూతురితో క‌లిసి తిరువనంతపురంలోని టెక్నోపార్క్‌ ప్రధాన కార్యాలయంలో సైబర్ ఫోరెన్సిక్స్ స్టార్ట‌ప్ కంపెనీని ప్రారంభించారు. చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పైర‌సీని నిరోధించే ల‌క్ష్యంతో దీన్ని ప్రారంభించారు.