Devara : అప్పుడు బాహుబలి.. ఇప్పుడు దేవర.. హిందీ థియేట్రికల్ రైట్స్‌ని దక్కించుకున్న బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ..

అప్పుడు బాహుబలిని హిందీ ఆడియన్స్ కి పరిచయం చేసి హిట్ అందుకున్న బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ.. ఇప్పుడు దేవర హిందీ థియేట్రికల్ రైట్స్‌ని దక్కించుకుంది.

Devara : అప్పుడు బాహుబలి.. ఇప్పుడు దేవర.. హిందీ థియేట్రికల్ రైట్స్‌ని దక్కించుకున్న బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ..

Karan Johar own the NTR Devara hindi theatrical distribution rights

Devara : ఆర్ఆర్ఆర్ తరువాత మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఇక ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుంటే జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు.

ఈ బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో నార్త్ లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకి నార్త్ బెల్ట్ లో కూడా మంచి మార్కెట్ జరుగుతుంది. ఇక ఈ మార్కెట్ ని గమనించిన బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ దేవర నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కరణ్ జోహార్ ఈ నిర్మాణ సంస్థకి ఓనర్. గతంలో ఈ నిర్మాణ సంస్థ బాహుబలి సినిమాని నార్త్ ఆడియన్స్ ముందుకు తీసుకువెళ్లి బ్లాక్ బస్టర్ ని అందుకుంది.

Also read : Sasivadane : ‘శశివదనే’ సినిమా నుంచి ‘వెతికా నిన్నిలా’ మెలోడీ సాంగ్ రిలీజ్..

ఆ తరువాత ‘ఘాజి’ని కూడా రిలీజ్ చేసి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి హిందీ ఆడియన్స్ ని అలరించి బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని చూస్తున్నారు. కాగా ఈ ప్రొడక్షన్ నుంచి దేవర రిలీజ్ అవ్వడం ఎంతో ప్రాఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఈ నిర్మాణ సంస్థ ద్వారా నార్త్ లో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రాండ్ రిలీజ్ వల్ల భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు.