Sasivadane : ‘శశివదనే’ సినిమా నుంచి ‘వెతికా నిన్నిలా’ మెలోడీ సాంగ్ రిలీజ్..

'శశివదనే' సినిమా నుంచి 'వెతికా నిన్నిలా' అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Sasivadane : ‘శశివదనే’ సినిమా నుంచి ‘వెతికా నిన్నిలా’ మెలోడీ సాంగ్ రిలీజ్..

Vethika Ninnila Lyrical Song released from Sasivadane movie

Updated On : April 10, 2024 / 2:08 PM IST

Sasivadane : రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న అందమైన ప్రేమకథ ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. రిలీజైన ప్రతి కంటెంట్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

ఇక తాజాగా మూవీ నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘వెతికా నిన్నిలా’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. శరవణన్ వాసుదేవన్ అందించిన ఈ పాటకి కిట్టు విస్సప్రగడ లిరిక్స్ ని అందించారు. సత్య యామిని పాటని పాడారు. ఈ మెలోడీ సాంగ్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. మరి ఆ పాటని మీరుకూడా వినేయండి.

Also read : Samantha : నాగచైతన్యని ఎందుకు మోసం చేశావు.. నెటిజెన్ అడిగిన ప్రశ్నకి సమంత జవాబు..

కాగా ఈ ప్రేమ కథని గోదావరి నేపథ్యంలో అందంగా చూపించబోతున్నారు. రక్షిత్, కోమలీ జంట ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి టీజర్ అండ్ సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.