Samantha : నాగచైతన్యని ఎందుకు మోసం చేశావు.. నెటిజెన్ అడిగిన ప్రశ్నకి సమంత జవాబు..

నాగచైతన్యని ఎందుకు మోసం చేశావు అంటూ నెటిజెన్ అడిగిన ప్రశ్నకి సమంత ఏం జవాబు ఇచ్చారంటే..

Samantha : నాగచైతన్యని ఎందుకు మోసం చేశావు.. నెటిజెన్ అడిగిన ప్రశ్నకి సమంత జవాబు..

Samantha counter commet to netizen about divorce with Nagachaitanya

Updated On : April 10, 2024 / 1:04 PM IST

Samantha : హీరోయిన్ సమంత అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయి ఏళ్ళు గడుస్తున్నాయి. కానీ వీరి విడాకులు గురించి ఇప్పటికీ ఎవరో ఆఖరు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. కొందరు ఇలా ప్రశ్నలు వేస్తుంటే, మరికొందరు నిందిస్తూ ఉంటారు. సమంత, చైతన్య మధ్య జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు.

కానీ కొంతమంది సమంతని సపోర్ట్ చేస్తూ చైతన్యని దూషించడం, మరికొంతమంది సమంతని దూషిస్తూ చైతన్యని సపోర్ట్ చేయడం చేస్తుంటారు. తాజాగా ఓ నెటిజెన్ చైతన్య వైపు నుంచి మాట్లాడుతూ.. సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కింద వైరల్ కామెంట్ చేసాడు. ఆ కామెంట్ ఏంటంటే.. “మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు..?” అంటూ ఆ నెటిజెన్ సమంతని ప్రశ్నించారు.

Also read : NTR : ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్‌లో.. ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు..

ఇక దీనికి సమంత బదులిస్తూ.. “సారీ ఇలాంటివి చేయడం మీకు మంచి కాదు. మీకు ఇంకా బలమైనవి కావలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్ చేసారు. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటితో మరోసారి చైతన్య సమంత విడాకుల వార్త ట్రేండింగ్ లోకి వచ్చింది.

Samantha counter commet to netizen about divorce with Nagachaitanya

కాగా సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునేందుకు సమంత చికిత్స తీసుకుంటున్నారు. ఒక పక్క చికిత్స తీసుకుంటూనే, తనకి వచ్చిన అరుదైన రోగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక హెల్త్ పాడ్‌కాస్ట్ ని స్టార్ట్ చేసి.. ఆ సమస్య గురించి అందరికి తెలియజేస్తూ వస్తున్నారు.