‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్‌లో.. ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు..
'టిల్లు స్క్వేర్' సక్సెస్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. దాని ధర అక్షరాలా..

Devara star NTR hand watch cost gone viral in social media
JrNTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే అంత బిజీ సమయంలో కూడా ఎన్టీఆర్ సమయం తీసుకోని ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ సోమవారం హైదరాబాద్ లో ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ఫార్మల్ డ్రెస్సులో చాలా సింపుల్ గా వచ్చి ఆకట్టుకున్నారు. అయితే ధరించిన డ్రెస్ చాలా సింపుల్ గా కనిపించిన, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం చాలా గ్రాండ్ గా కనిపించింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు.. ఆ వాచ్ ధర ఎంత ఉంటుందో అని నెట్టింట తెగ వెతికేసారు.
అయితే ఎట్టకేలకు అది ‘Audemars Piguet Royal Oak Offshore’ మోడల్ వాచ్ అని, దాని ధర అక్షరాలా రూ.16,232,657 కనిపెట్టేసారు. ఈ విషయాన్ని ప్రస్తుతం నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ ధర చూసిన నెటిజెన్స్.. షాక్ అవుతున్నారు.
Also read : Prabhas : వర్షం 50 డేస్ ఫంక్షన్‌లో.. ప్రభాస్ కోసం వచ్చిన జనాల్ని చూసి షాక్ అయ్యా.. నవీన్ చంద్ర..
Tiger tho mamul ga undadhu ?@tarak9999 #Devara pic.twitter.com/WjrOi1asrZ
— NTR Royal Fans ™ (@NTRRoyalFans) April 9, 2024
ఇక దేవర సినిమా విషయానికి వస్తే, టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కాలరు ఎగరేసుకునేలా సినిమా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ లో అంచనాలు అమాంతం పెంచేశారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ని దసరా కానుకగా అక్టోబర్ 10న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.
ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో నిర్మాత కళ్యాణ్ రామ్.. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.