జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారత అంతర్భాగం : పాక్ ప్రకటన

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అంటూ సంచలన ప్రకటన చేసింది పాకిస్తాన్.

  • Publish Date - September 10, 2019 / 01:37 PM IST

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అంటూ సంచలన ప్రకటన చేసింది పాకిస్తాన్.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అంటూ సంచలన ప్రకటన చేసింది పాకిస్తాన్. భారత్ లోని అంతర్భాగ రాష్ట్రం అయిన జమ్మూకాశ్మీర్ లోకి అంతర్జాతీయ మీడియాను ఎందుకు అనుమతించటం లేదంటూ కూడా కొర్రీ పెట్టారు పాక్ విదేశాంత మంత్రి ఖురేషీ. 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత పాక్ విదేశాంగ శాఖ కాశ్మీర్ అంశంపై ఘాటుగా స్పందించటం ఇదే. 

కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే అని చెబుతూనే సన్నాయినొక్కులు నొక్కారు ఖురేషీ. కర్ఫ్యూ ఎందుకంటూ ప్రశ్నించారాయన. కర్ఫ్యూ తొలగిస్తే అసలు విషయం ప్రపంచానికి తెలుస్తుందంటూ లేనిపోని అపోహలను సృష్టించేందుకు ప్రయత్నించారాయన. ప్రశాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ లో ఏదో జరుగుతుందనే రాద్దాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఖురేషీ.