America OPT: ఓపీటీ అంటే ఏమిటి..? ఓపీటీ రద్దు బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో మనోళ్లకు కెరీర్ ఉండదా..?
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) రద్దు చేస్తామంటూ అమెరికా చట్ట సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఆమోదం పొందితే చదువులకోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను ఇబ్బందుల్లో పడేస్తుంది.

Indian students in America
America OPT: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను ప్రత్యేక విమానాల ద్వారా సంకెళ్లు వేసి వారివారి దేశాలకు పంపించిన ట్రంప్.. అక్కడ చదువుకోసం వెళ్లిన విద్యార్థులపైనా ఆంక్షలు విధించారు. తాజాగా.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) రద్దు చేస్తామంటూ చట్ట సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఆమోదం పొందితే చదువులకోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను ఇబ్బందుల్లో పడేస్తుంది. అమెరికాలో భారతీయ విద్యార్థులు 3లక్షల మంది ఉండొచ్చని అంచనా.
OPT అంటే ఏమిటి?
OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు, వారి డిగ్రీని పూర్తిచేసిన తర్వాత కొంత కాలం వృత్తి శిక్షణ పొందేందుకు అనుమతించే ఒక ప్రోగ్రామ్. ఏదైనా డిగ్రీ చదివే వారికి ఈ OPT సౌలభ్యం ఉంటుంది. ఈ ఓటీపీ రెండు రకాలు. మొదటిది ఏడాది ఉంటుంది. రెండోది ఆ తర్వాత మరో రెండేళ్ళు అమెరికాలో ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఓటీపీకి ఎప్పుడు అప్లయ్ చేసుకోవాలి..
సహజంగా ఇండియా నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులందరూ ఎఫ్1 వీసా మీద వెళ్తారు. అక్కడికి వెళ్లాక ఎఫ్1 వీసా కంప్లీట్ అయ్యేలోపు ఒక ఏడాదికి ఓటీపీ కోసం అప్లయ్ చేసుకోవాలి. సరియైన సమయంలో అప్లయ్ చేస్తేనే వస్తుంది. అప్లయ్ చేయకుండా డీపాల్ట్ గా రాదు. ఏడాది తరువాత ఎవరైతే STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు మరో రెండేళ్లు ఓటీపీకి అవకాశం ఇస్తారు. అదికూడా ముందుగా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. STEM కాకుండా వీఎఫ్ ఎక్స్, యాక్టింగ్ కోర్సులు నేర్చుకునే వారికి ఓపీటీ అవకాశం ఉండదు.
మూడేళ్లలో జాబ్ దొరక్కపోతే..
మొదటి ఏడాది, ఆ తరువాత మరో రెండేళ్లు. మొత్తం మూడేళ్లలోపు జాబ్ దొరికితే ఓకే. లేకపోతే స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకోసారి ట్రై చేద్దాం అనుకునే వారు మాస్టర్స్ లో జాయిన్ అవ్వొచ్చు. అప్పుడు ఓపీటీ నుంచి సీపీటీకి మారతారు. ఒకవేళ జాబ్ దొరికితే F1 నుంచి H1B కి వీసా మారుతుంది.
F1వీసా మీద వెళ్లినవాళ్లు కేవలం స్టూడెంట్స్ మాత్రమే. ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. ఓపీటీలో అయితే, క్యాంపస్ బయట వారానికి 20 గంటలకు మాత్రం పనిచేసుకునేందుకు పర్మిషన్ ఉంటుంది. దీనికి ఎక్కువ పోటీ ఉంటుంది. ఓపీటీలో ఉండే వాళ్లకు ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటంటే ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్ గా ఉంటూ తన కన్నా తక్కువ క్లాసుల వాళ్లకు టీచింగ్ చేయొచ్చు. ఇది అప్రూవ్డ్. ఇక్కడా ఇండియన్స్ కాంపిటీషన్ ఎక్కువ. ఇక సీపీటీలో అయితే వారానికి 40 గంటలు పనిచేసుకోవచ్చు.
కాంగ్రెస్ సభ్యుడు పాల్ గోసర్ అమెరికా శాసనసభలో ఓటీపీ ప్రోగ్రామ్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఆయన వాదన ప్రకారం.. ప్రతి సంవత్సరం విద్యార్థి వీసాలపై అమెరికాకు వస్తున్న సుమారు లక్ష మంది విదేశీయులు OPT ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకుంటున్నారు. తద్వారా వారి చదువు పూర్తయిన తర్వాత కూడా అదనంగా మూడేళ్ల పాటు అక్కడే నివసించే అవకాశం పొందుతున్నారు. ఈ విధానం అమెరికన్ ఉద్యోగుల అవకాశాలను తగ్గిస్తోందని ఆయన అభిప్రాయపడుతున్నారు.