Russia-Ukraine War: యుక్రెయిన్ సరిహద్దుల్లో ఇండియన్ స్టూడెంట్లపై అరాచకాలు
రష్యా చేస్తున్న దాడులకు కొద్ది రోజులుగా నెలకొన్న భయానక వాతావరణం నుంచి పారిపోయేందుకు భారత విద్యార్థులు తిరుగు ప్రయాణమయ్యారు.

Ukarine Army
Russia-Ukraine War: రష్యా చేస్తున్న దాడులకు కొద్ది రోజులుగా నెలకొన్న భయానక వాతావరణం నుంచి పారిపోయేందుకు భారత విద్యార్థులు తిరుగు ప్రయాణమయ్యారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల కోసం కిలోమీటర్ల దూరం నడిచి సరిహద్దుల్లో ఎదురుచూస్తున్నారు. అలాగే కొందరు విద్యార్థులు యుక్రెయిన్-పోలాండ్ బోర్డర్ వద్ద కూర్చొని ఉండగా యుక్రెయిన్ అధికారులు వేధింపులకు దిగారు.
ఒక స్టూడెంట్ ను వరుసగా గుద్దుతూ.. ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న మరో వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మరో వీడియోలో గాల్లోకి కాల్పులు జరుపుతూ.. యుక్రెయిన్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ విద్యార్థులను బెదిరిస్తున్నారు. ఆ వీడియోలో తను, తన స్నేహితురాలిని యుక్రెయిన్ పోలీసులు కొట్టి వెనక్కు నెట్టేసినట్లుగా తెలుస్తుంది. పోలీసుల గుంపు వారందరినీ వాహనంలోకి నెట్టి వెనక్కు తీసుకునేందుకు యత్నించారు..
Read Also : శాంతి చర్చలకు సై అన్న రెండు దేశాలు.. అణ్వాయుధాలపై రష్యా కీలక ప్రకటన..!
ఆ వీడియోను షేర్ చేస్తూ.. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ఆడపిల్లలని కూడా చూడకుండా ఎలా తోసేస్తున్నారో చూడండి’ అంటూ కామెంట్ చేశారు.
‘విద్యార్థులు హింసకు గురవుతున్న వీడియోలను వారి ఫ్యామిలీ కూడా చూస్తుంది. ఏ పేరెంట్ ఇవి చూసి తట్టుకోలేరు. వారందరినీ వీలైనంత త్వరగా తీసుకొచ్చేయండి. మన వాళ్లను వదులుకోకూడదు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.