Viral Video: ఊలాలా పాటకు డెన్మార్క్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన భారతీయ మహిళ
ఆమె ఇచ్చిన హావభావాలు, ఆమె ఎనర్జీ అందరినీ ఆకర్షించింది.

ఊలాలా పాటకు డెన్మార్క్‌లో అదిరిపోయే స్టెప్పులేసింది ఓ భారతీయ మహిళ. ఆమె డ్యాన్సును చూసిన ప్రేక్షకులు వావ్ అనకుండా ఉండలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
డెన్మార్క్‌లో జరిగిన ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న నటాషా షెర్పా అనే ఓ ఇన్‌ఫ్లూయన్సర్ శ్రేయా ఘోషల్ పాట ఊలాలాకు ఇలా స్టెప్పులు వేసింది. ఆమె ఇచ్చిన హావభావాలు, ఆమె ఎనర్జీ అందరినీ ఆకర్షించింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా లక్షలాది వ్యూస్ వచ్చాయి.
నటాషా షెర్పాకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు అధికంగా ఉంటారు. ఆమె తరచుగా తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ‘నా రక్తంలోనే బాలీవుడ్ ఉంది.. ఇప్పుడు వీరి హృదయాలలోనూ..” అంటూ ఆమె ఈ పోస్ట్ చేసింది. డెన్మార్క్ రెడ్ బుల్ డాన్స్ యువర్ స్టైల్ నేషనల్ ఫైనల్స్‌లో ఆమె ఇలా ప్రదర్శన ఇచ్చింది.
ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేసింది ఆమెనే. తన సహ హోస్ట్‌లకు, నిర్వాహకులకు, తోటి నృత్యకారులకు కృతజ్ఞతలు తెలిపింది. ది డర్టీ పిక్చర్ సినిమా కోసం ఊలాలా పాట పాడిన శ్రేయా ఘోషల్‌ను కూడా ట్యాగ్ చేసింది. ఈ డ్యాన్స్ పోటీలో పాల్గొనడం ద్వారా భారతీయ సంస్కృతి గురించి అక్కడి వాళ్లకు చూపించే అవకాశం దొరికిందని ఆమె పేర్కొంది. ఈ పోటీకల ఫైనల్స్ ముంబైలో జరగబోతున్నాయని వివరించింది.
View this post on Instagram
PM Modi : ప్రధాని మోదీ నివాసంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్.. ఏం పేరు పెట్టారో తెలుసా..? వీడియో వైరల్