G20 summit In Bali : ప్రధాని మోడీకి ‘సుత్తి’ అందజేసిన ఇండోనేషియా అధ్యక్షుడు .. కారణం ఇదే

బాలిలో జీ20 సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ‘సుత్తి’ అందజేశారు ఇండోనేషియా అధ్యక్షుడు.దీని వెనుక కారణం ఏమంటే..

G20 summit In Bali.. : ఇండోనేసియాలోని బాలి వేదికగా G20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రధాని నరేంద్ర మోడికి ఓ ‘సుత్తి’ని బహుమతిగా అందజేశారు. తదుపరి G20 శిఖరాగ్ర సదస్సు భారత్‌లో జరుగనుంది. దీనికి సూచనగా మోడీ చేతికి బ్యాటన్‌‌‌గా చెక్కతో తయారు చేసిన సుత్తిని డొనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ అందించారు. దాన్ని మోడీ స్వీకరించారు. అనంతరం ముగింపు సెషన్‌లో మాట్లాడారు. G20 తదుపరి శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోందనే విషయాన్ని ప్రకటించారు.

G20 సదస్సులో సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొన్న కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి. రష్యా-యుక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం సహా పలు అంశాలపై సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు చర్చించారు. తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీటికి సంబంధించి నిర్ణయాలతో కూడిన తీర్మానాలను సంయుక్తంగా ఆమోదించారు.

G20 summit..Rishi Sunak : ‘రష్యా చేసేది అనాగరిక యుద్ధం..ఈ సదస్సుకు పుతిన్ వచ్చి ఉంటేనా..’ అంటూ రష్యా మంత్రి ఎదుటే రిషి సునక్ ఘాటు వ్యాఖ్యలు

ఈ సదస్సు ముగింపు రోజు (నవంబర్ 16,2022) ప్రధాని మోడీ అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఎమ్మానుయేల్ మక్రాన్‌ను కలిశారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హెసెన్ లూంగ్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్-సింగపూర్, భారత్-జర్మనీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, ఆర్థిక అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి. అంతకుముందు ప్రధాని మోదీ ఆయా దేశాల నేతలతో కలిసి మడ అడవులను సందర్శించారు. మొక్కలను నాటారు. సరదాగా గడిపారు. ఛలోక్తులు వేసుకున్నారు.

ఆ వెంటనే రెండో రోజు సమ్మిట్‌లో వేర్వేరు సెషన్స్‌లో పాల్గొన్నారు. తొలి రోజు సెషన్స్‌లో ప్రధాని మోడీ బిజీ బిజీగా గడిపారు. ఆహారం, ఇంధన భద్రత అంశంపై ఏర్పాటైన వర్కింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆహార భధ్రత, ఎరువులు, ఇంధన అవసరాలను ఆయన ప్రస్తావించారు. G20 లీడర్స్ సమ్మిట్‌లో జో బైడెన్‌ను కలుసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా భేటీ అయ్యారు.

G20 Summit: మరోసారి పట్టుతప్పి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. వీడియో వైరల్

తదుపరి జీ20 సమ్మిట్‌కు అధ్యక్షతను వహించబోతోండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. భారత్‌లో ఏర్పాటు కాబోయే G20 సదస్సు.. ప్రపంచ సమైక్యతకు అద్దం పడుతుందన్నారు మోడీ. అందరినీ కలుపుకొని, ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిర్మయాత్మక, కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రాబోయే సంవత్సర కాలంలో G20 సమిష్టి కార్యాచరణకు ఊతమిచ్చేలా ఈ ప్లానింగ్ ఉంటుందని వివరించారు.

కాగా..G20లో భారత్‌తోపాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్ అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే G20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంటుంది.

G20 summit : జీ20 సదస్సులో మోడీతో రిషి సునక్ ముచ్చట్లు

ట్రెండింగ్ వార్తలు