G20 Summit: మరోసారి పట్టుతప్పి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పట్టుతప్పి కింద పడబోయారు. ఇండొనేషియాలోని బాలీలో జీ20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ఆయా దేశాల అధినేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాలీలోని తమన్ హుటాన్ రాయ అటవీ పార్కులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జో బైడెన్ మెట్లు ఎక్కుతూ పట్టుతప్పారు. అనంతరం తన పక్కన ఉన్న వ్యక్తిని బైడెన్ పట్టుకున్నారు.

G20 Summit: మరోసారి పట్టుతప్పి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. వీడియో వైరల్

G20 Summit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పట్టుతప్పి కింద పడబోయారు. ఇండొనేషియాలోని బాలీలో జీ20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ఆయా దేశాల అధినేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాలీలోని తమన్ హుటాన్ రాయ అటవీ పార్కులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జో బైడెన్ మెట్లు ఎక్కుతూ పట్టుతప్పారు.

అనంతరం తన పక్కన ఉన్న వ్యక్తిని బైడెన్ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బైడెన్ ఇలా పట్టు తప్పడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుసార్లు ఆయన ఇలా పడబోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి.

కాగా, జీ20 సమావేశంలో భాగంగా ఆయా దేశాల అధినేతలు ఆ పార్కులో ఒకే చోట కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా బైడెన్- భారత ప్రధాని మోదీ పరస్పరం అభివాదం చేసుకున్నారు. పలు దేశాల అధినేతలతో మోదీ చర్చలు జరిపే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..