Good Mosquitoes : ఈ దోమలు ‘మంచి’వి : డెంగ్యూని నివారిస్తాయి

డెంగ్యూ నివారించటానికి ‘మంచి’ దోమల్ని పెంచుతున్నారు శాస్త్రవేత్తలు.

Good Mosquitoes That Can Prevent Dengue : దోమలు మనుషుల్ని..పశువుల్ని కుట్టి కుట్టి ఇబ్బందులు కలిగిస్తాయని తెలుసు. కొన్ని దోమలు కుడితే పలు రోగాలు వ్యాపిస్తాయని తెలుసు. వ్యాధుల్ని కలుగజేసే దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ రోగాల్ని కలిగించే దోమలే కాకుండా రోగాల్ని నివారించే దోమలు కూడా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధుల్ని నివారించే ఆ దోమలే ‘మంచి’దోమలు అని చెబుతున్నారు. అటువంటి దోమల్ని ఇండోనేషియా శాస్త్రవేత్తల వినూత్న పరిశోధన ద్వారా కనుగొన్నారు. ఈ దోమలు డెంగ్యూ వ్యాధిని నివారిస్తాయని చెబుతున్నారు. డెంగ్యూ జ్వరాన్ని పరిష్కరించడానికి ఈ కొత్త పద్ధతి అంటువ్యాధుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుందంటున్నారు.

Read more : Mustard plant Aviation Fuel : ఆవాలతో విమానం ఇంధనం తయారీ..భారతీయ శాస్త్రవేత్త పరిశోధనలో వెల్లడి

డెంగ్యూ లాంటి వ్యాధులను కలుగజేసే ఏడిస్‌ ఈజిప్టి లాంటి దోమలు చెడ్డవైతే.. అదే డెంగ్యూను నివారించగల వోల్బాకియా అనే బ్యాక్టీరియాను కలిగి ఉన్న దోమలు మంచి దోమలు అని చెబుతున్నారు ఇండోనేషియా శాస్త్రవేత్తలు. ఈ రెండు రకాల దోమలు కలిస్తే వాటికి పుట్టే దోమలు కుట్టినా ఎటువంటి హాని కలగదట. ఆ రెండు దోమలకు పుట్టే దోమల్లో వోల్బాకియా బ్యాక్టీరియా ఉంటుందని..ఈ దోమలు కుట్టినా డెంగ్యూ వ్యాధి సోకదని ఇండోనేషియా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు.

Read more : Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

డెంగ్యూ నివారించటానికి ఇటువంటి పద్ధతి చాలా ఉపయోగపరడుతుందంటున్నారు. దీనికి సంబంధించి ఇండోనేషియా శాస్త్రవేత్తలు 2017 నుంచి పరిశోధనలు చేస్తున్నారు. డెంగ్యూ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వోల్బాకియా దోమలను వదిలి పెట్టగా..వీటిని ప్రవేశపెట్టిన ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు 77% తగ్గాయని శాస్త్రవేత్తలు. అంటే మంచి దోమల వల్ల డెంగ్యూని శాశ్వతంగా నివారించే అవకాశాలు రానున్న రోజుల్లో వస్తాయని నమ్మవచ్చని తెలుస్తోంది. ఈ పరిశోధనల గురించి శాస్త్రవేత్త పూర్వంతి మాట్లాడు..తాము మంచి దోమల్ని పెంచుతున్నామని వాటి ద్వారా డెంగ్యూవంటి వ్యాధుల్ని నివారించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు