Mustard plant Aviation Fuel : ఆవాలతో విమానం ఇంధనం తయారీ..భారతీయ శాస్త్రవేత్త పరిశోధనలో వెల్లడి

'ఆవాల'తో విమానం ఇంధనం తయారు చేయవచ్చని భారతీయ శాస్త్రవేత్త చేసిన పరిశోధనల్లో వెల్లడైంది..

Mustard plant Aviation Fuel : ఆవాలతో విమానం ఇంధనం తయారీ..భారతీయ శాస్త్రవేత్త పరిశోధనలో వెల్లడి

Mustard Plant Can Replace The Petroleum Based Aviation Fuel

Mustard plant can replace the petroleum-based aviation fuel : భారతీయ శాస్త్రవేత్త పునీత్‌ ద్వివేది తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ఓ అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమాన ఇంధనాన్ని తయారు చేయవచ్చని కనుగొన్నారు. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనెతో విమానం ఇంధనం తయారు చేయవచ్చని పునీత్ ద్వివేది చెబుతున్నారు.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో విమానాల ఇంధన ఖర్చులు ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు పెనుభారంగా మారిన ఈ సమయంలో భారతీయ శాస్త్రవేత్త పునీత్ ద్వివేది తెలిపిన ఈ విషయం విమాన సంస్థలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంధనం కోసం ఆయా విమానయాన సంస్థలు భారీగా ఖర్చు చేస్తున్న క్రమంలో విమానాల ఇంధనం ఖర్చును తగ్గించేందుకు భారతీయ శాస్త్రవేత్త పునీత్ ఊరట కలిగించారు.

Read more : Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

ఈ కొత్త పరిశోధనతో ఇంధన ఖర్చులు తక్కువ అవుతాయి. అంతేకాదు..కర్బన ఉద్గారాలను 68 శాతం తగ్గించవచ్చని తేలింది. తాజాగా పునీత్‌ ద్వివేది పరిశోధనకు సంబంధించిన వివరాలు జీసీబీ బయో ఎనర్జీ జర్నల్‌లో ప్రచురించబడింది. సౌత్ఈస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రిన్యూవబుల్స్‌ ఫ్రమ్‌ కేరినాటా ప్రాజెక్టులో పునీత్‌ ద్వివేది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టును15 మిలియన్ల డాలర్లతో అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ చేపట్టింది. ఈ పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.కాగా..గత 4 సంవత్సరాలుగా అమెరికాలోని ‘కేరినాటా’ రకం ఆవాలపై పరిశోధనలు సాగుతున్నాయి. వాటిని ఎలా పెంచాలి, వాటి నుంచి నూనె ఎలా సేకరించాలన్న దానిపై పరిధోనల్ని శాస్త్రవేత్తలు ఉదృతం చేస్తున్నారు. చమురు ఇంధనంతో పోలిస్తే… ఆవాల మొక్కలతో లీటర్‌ ఇంధనం తయారు చేయడానికి 0.12 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది.

ఆవాలతో తయారు చేసే ఇంధనం ద్వారా ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చని..తద్వారా గ్లోబల్ వార్మింగ్ ను 3.5 శాతం తగ్గించవచ్చని జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పునీత్‌ ద్వివేదీ తెలిపారు. అమెరికాలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 2.5 శాతం విమానయాన రంగానిదే. అయితే దీన్ని తగ్గించేందుకు.. తమకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే ఆవాలు ఇంధనాన్ని తయారు చేస్తామని పునీత్ ద్వివేది తెలిపారు.ఇటువంటి పరిశోధనలు చాలా అవసరమనీ..ఇవి ఆర్థిక అవకాశాలను సృష్టిస్తాయని.. అలాగే పర్యావరణ వ్యవస్థకు మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కేరినాటా రకం ఆవాల పంటను శీతాకాలపు పంటగా పండించవచ్చని తెలిపారు.

Read more :Crazy Job News : మంచంపై హాయిగా పడుకుంటే చాలు..రూ.25 లక్షల జీతం..!

“కారినాటా ‘ఆఫ్’ సీజన్‌లో పెరుగుతాయని..కాబట్టి ఈ పంట ఇతర ఆహార పంటలతో పోలీస్తే పెద్ద గా పోటీ ఉండదని..ఈ పంట ఆహారాలల్లో ఉపయోగించటంతో పాటు ఇంధన సమస్యలకు సమస్యలకు చక్కటి పరిష్కారమని తెలిపారు ద్వివేది. కారినాటా పంటకు నీటి నాణ్యత, నేల నాణ్యత, జీవవైవిధ్యానికి సంబంధించిన అన్ని విధాలుగా మేలు జరుగుతుందని తెలిపారు ద్వివేది.