Gold Island : బంగారు ఐలాండ్ లో మత్స్యకారులకు దొరికిన లక్షల కోట్ల విలువైన నిధి..!

బంగారు ద్వీపంలోమత్స్యకారులకు లక్షల కోట్ల విలువైన నిధి దొరికింది.ఈ నిధిలో బంగారం,వజ్రాలతో పాటు మిలియన్ల పౌండ్లు విలువచేసే బుద్ధుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.

fishermen find a huge treasure Worth Is Billions trove : లంకెబిందెలు దొరికాయని..తవ్వకాల్లో బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు దొరికాయని వింటుంటాం. పలు సినిమాల్లో నిథిని దక్కించుకోవటాని ఎన్నో రహస్యాలను ఛేదిస్తు..ఆఖరికి నిధిని దక్కించుకున్న ఆసక్తికర సన్నివేశాల్ని ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తుంటాం.కానీ అటువంటి నిధులు నిజంగానే ఉంటాయి. చందమామ కథలో చదివా పడగడపు దీవులు ఉంటాయని నమ్మటానికి ఎంత బాగుందో అనే పాట విన్నప్పుడు అటువంటి పగడపుదీవుల్ని చూడాలని అనుకునే ఉంటాం.కానీ అచ్చం కథల్ని మంచిన ఓ రియల్ ‘ట్రెజర్ హంట్’ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండోనేషియా మత్స్యకారులకు కోట్లాది విలువ చేసే నిధి దొరికింది..! ఆ నిధికి విలువ కట్టలేనిదంటున్నారు దాని గురించి తెలిసినవారు. ఆ నిధి వివరాలు ఏంటో ఆ నిధిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం..

నిధి కోసం ఐదు ఏళ్లుగా వేట..ఎట్టకేలకు దొరికిన అపార సంపద..!!
ఇండోనేషియా ద్వీపమైన సుమత్రాలోని పాలెంబాంగ్ సమీపంలో ఉన్న మూసీ నది మత్స్యకారులు బంగారు ద్వీపాన్ని కనుగొన్నారు. సుమత్రా దీవికి బంగారం ద్వీపం అనేపేరు కూడా ఉంది. అక్కడో నిధి ఉందని బంగారం, విలువ కట్టలేని వజ్రాలు,వైఢూర్యాలు, బంగారు హారాలు,ఉంగరాలు, బంగారపు ముద్దలు ఉన్నాయని ఎప్పుటినుంచో ప్రచారం. దీంతో దాన్ని బంగారుదీవి అనేవారు. ఆ నిధిని దక్కించుకోవటానికి ఎంతోమంది సాహసించి విఫలమయ్యారు. అదంతా ఓ కట్టు కథ అని నిజం కాదని నిధి అనేదే లేదనేవారు కొందరైతే..మరికొందరు ఆశావహులు మాత్రం అదికధ కాదని నిజమేనని నమ్మి దాని కోసం ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా వేట సాగించేవారు. కానీ ఎవ్వరికి దొరకలేదు. కానీ దాని కోసం వేట సాగించేవారు మాత్రం పదే పదే యత్నించేవారు. ఒక్కసారైనా ఫలించకపోతుందా? అని..

Read more : Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

భయంకరమైన మొసళ్ల నదిలో నిధికోసం వేట..
సుమత్రాలోని పాలెంబాంగ్ సమీపంలో ఉన్న మూసీ నదిలో మొసళ్లు భారీ సంఖ్యలో ఉంటాయి. ఇటువంటి ప్రమాదకర నదిలో నిధి కోసం వేట సాగించారు పలువురు. కానీ ఫలితం దక్కలేదు.దీంతోవారు అదంతా నిజం కాదని మిన్నకుండిపోయారు.కానీ కొంతమంది మత్స్యకారులు మాత్రం అది కధకాదు నిజమని నమ్మారు. దానికోసం వేట సాగిస్తునే ఉన్నారు పట్టువదలని విక్రమార్కుడిలాగా. అలా గత ఐదేళ్లుగా బంగారం ద్వీపం కోసం వెదుకుతున్నారు స్థానిక మత్సకారులు.వారి వేట ఫలించింది. నిధి అనేది కదకాదు నిజమని రుజువైంది. ఆ రుజువుకు నిదర్శనంగా బంగారం, విలువైన రత్నాలు, నాణెలు, బంగారు ఉత్సవ ఉంగరాలు, కాంస్య గంటలు..బుద్ధుడి విగ్రహం వంటి అరుదైన సంపదతో నిండిన ద్వీపాన్ని మత్స్యకారులు కనిపెట్టారు. ఆ నిధిలో 8వ శతాబ్దానికి చెందిన రత్నాలతో అలంకరించబడిన బుద్ధుని విగ్రహం కూడా బయటపడింది. ఈ విగ్రహం విలువ మిలియన్ల పౌండ్లు ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కనుగొనబడిన అత్యంత విలువైన నిధుల్లో ఇది ఒకటని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

శ్రీవిజయ నాగరికతకు చెందినవే..
‘ది గార్డియన్‌’ అనే బ్రిటీష్‌ డైలీ న్యూస్‌ పేపర్‌ నివేదిక ప్రకారం.. ఈ గుప్త నిధి శ్రీవిజయ నాగరికతకు సంబంధించింది. క్రీ.శ. 7 నుంచి 13వ శతాబ్ధం వరకు శ్రీ విజయ సామ్రాజ్యం ఎంతో వైభవంతో విలసిల్లింది. ఐతే కేవలం ఒక శతాబ్ధకాలంలో ఈ సామ్రాజ్యం ఒక్కసారిగా కనుమరుగైపోయింది. దానికి గల కారణాలు ఏమిటో కూడా ఇప్పటి వరకు తెలియలేదు. అప్పట్లో ఈ సామ్రాజ్యంతో భారత్ కూడా చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లుగా తెలుస్తోంది.

శ్రీవిజయ సామ్రాజ్యం కల్పితం కాదంటున్న ఆర్కియాలజిస్టులు..
శ్రీవిజయ సామ్రాజ్యం గురించి బ్రిటీష్‌ కు చెందిన మరైన్‌ ఆర్కియాలజిస్టు డా. సీన్‌ కింగ్‌స్లే తెలిపిన వివరాల ప్రకారం..శ్రీ విజయ సామ్రాజ్యం ఒకప్పుడు ‘వాటర్ వరల్డ్’ గా ప్రసిద్ధిచెందింది. ఈ సామ్రాజ్యాన్ని చెక్కపడవలపై నిర్మించారట. రాజభవనాలు, దేవాలయాలతో పాటు పలు నివాసగృహాలను కూడా చెక్కలమీదనే నిర్మించారట. ఈ నాగరికత అంతరించిపోయినప్పుడు ఈ నిర్మాణాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయట.కాగా అక్కడి ప్రజలు ఇప్పటికీ చెక్క పడవలు తయారు చేసి వాడుతుంటారు. అలనాటి శ్రీ విజయ సామ్రాజ్యానికి గుర్తుగా వారి జీవన విధానాలు ఉన్నాయట. ఇంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ బంగారు సామ్రాజ్యంగా పేరొందిన శ్రీ విజయ సామ్రాజ్యానికి సంబంధించి ఎన్నో రహస్యాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. కానీ ఈ సామ్రాజ్యం గురించి స్థానిక ప్రజలతో పాటు పలువురు నిపుణులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

Read more : Bactrian Treasure : తాలిబన్ల చెరలో బంగారు గనులు.. ఆ బ్యాక్ట్రియన్‌ ఖజానాను ఏం చేస్తారో?
డాక్టర్ సీన్ కింగ్ స్లే తెలిపిన వివరాల్లో శ్రీవిజయ సామ్రాజ్య రాజధానిలో 20,000 మందికి పైగా సైనికులు నివసించారని తెలిపారు. అంతేకాదు భారీ సంఖ్యలో బౌద్ధ సన్యాసులు కూడా నివసించారట అక్కడ. ఈ శ్రీ విజయ సామ్రాజ్య నాగరికత గురించి తెలుసుకోవడానికి థాయ్‌లాండ్ నుండి భారతదేశం వరకు ఎన్నో బృందాలు ప్రయత్నించాయి. కానీ ఇప్పటికీ విజయవంతం కాలేదు. ఐతే గత ఐదేళ్లలో అసాధారణ విషయాలు తెరపైకి వస్తునే ఉన్నాయి. అన్ని కాలాలకు చెందిన నాణేలు, బంగారం, బౌద్ధ శిల్పాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. శ్రీవిజయరాజ్యం కల్పితం కాదనడానికి ఆధారాలు ఇవేనంటున్నారు డాక్టర్ సీన్ కింగ్ స్లే.

వీటితోపాటు ఆకాలంనాటి పాత్రలు,టేబుల్‌వేర్ వస్తువులు భారతదేశం, పర్షియా, చైనాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరి కాలంలో కాంస్య, బంగారు బౌద్ధ ఆలయాలు ఉండేవి. 20 వేల సైనికులు, వెయ్యి మంది బౌద్ధ సన్యాసులు, 800 వడ్డీ వ్యాపారులు ఈ సాంమ్రాజ్య రాజధానిలో ఉండేవారట. దీనిని బట్టి జనాభా కూడా అధికంగానే ఉండి ఉంటుందని తెలుస్తోంది. వీటితోపాటు రాహువు శిరస్సు విగ్రహం కూడా దొరికింది. భారతీయ హిందు ధర్మానికి సంబంధించిన అనేక ఇతర కళాఖండాలు కూడా బయటపడ్డట్టు కింగ్‌స్లే వెల్లడించారు.

Read more : 900 years old sword : సముద్రంలో స్కూబా డైవర్ కు దొరికిన 900 ఏళ్లనాటి ఖడ్గం

శ్రీవిజయ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? ఇప్పటికీ రహస్యంగా..
శ్రీవిజయ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? అనేదానికి ఎవరి దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇండోనేషియా అగ్నిపర్వతాలవల్ల గానీ లేదా వరదలు ముంచెత్తటం వల్లగానీ ఈ సామ్రాజ్యం కూలిపోయి ఉండవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం ఊహలు మాత్రమే.కానీ కచ్చితమైన ఆధారాలు మాత్రం లభ్యంకాని క్రమంలో అపారసంపద లభ్యం కావటంతో యావత్ ప్రపంచ దృష్టి ఈ బంగారు ద్వీపంపై పడింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు