Malasia
Indonesian married to Cooker : ఇండోనేషియాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించే రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫొటోలు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌లో అతడు మెరిసిపోగా, వధువుగా ముస్తాబైన రైస్ కుక్కర్‌ను వైట్ డ్రెస్‌తో అలంకరించాడు.
ఈ ఫొటోల్లో కొత్త జంట కెమెరాకు కలిసి ఫోజులు ఇవ్వడం కనిపించింది. తమ పెండ్లికి చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన పత్రాలపై పెండ్లికొడుకు అనం సంతకాలు చేస్తూ ఓ ఫోటోలో సందడి చేశాడు. మరో ఫొటోలో రైస్ కుక్కర్‌ను కిస్ చేస్తూ రొమాంటిక్ పోజిచ్చాడు. ఈ ఫొటోలకు “వైట్..క్వైట్..పర్ఫెక్ట్..వెరీ డ్రీమీ” అని క్యాప్షన్ ఇచ్చాడు.
General Milley : ట్రంప్ కి వెన్నుపోటు..కోవిడ్ టైంలో చైనాకి రహస్య ఫోన్ కాల్స్ చేసిన ఆర్మీ జనరల్
సెప్టెంబర్ 20న కుక్కర్‌తో తన పెండ్లిని ప్రకటిస్తూ ఆనం ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలకు 44,300కు పైగా లైక్‌లు, 1,35,000 రీట్వీట్‌లు వచ్చాయి. కుక్కర్‌ను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు.