General Milley : ట్రంప్ కి వెన్నుపోటు..కోవిడ్ టైంలో చైనాకి రహస్య ఫోన్ కాల్స్ చేసిన ఆర్మీ జనరల్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ హయాంలో జాయింట్​ చీఫ్స్​ ఆఫ్​ స్టాఫ్​గా ఉన్న జనరల్ మార్క్​ మిల్లీ..దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్‌కు ఫోన్‌ చేసి ముందే చెప్పేన వ్యవహారం

General Milley : ట్రంప్ కి వెన్నుపోటు..కోవిడ్ టైంలో చైనాకి రహస్య ఫోన్ కాల్స్ చేసిన ఆర్మీ జనరల్

Milley

Updated On : September 30, 2021 / 9:05 PM IST

General Milley  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ హయాంలో జాయింట్​ చీఫ్స్​ ఆఫ్​ స్టాఫ్​గా ఉన్న జనరల్ మార్క్​ మిల్లీ..దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్‌కు ఫోన్‌ చేసి ముందే చెప్పేన వ్యవహారం ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ట్రంప్‌.. చైనాపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన జనరల్ మిల్లీ..అక్టోబర్‌-30,2020న పీపుల్ లిబరేషన్ ఆర్మీ(చైనా ఆర్మీ) టాప్ కమాండర్ జనరల్‌ లీ జూఛెంగ్‌కు ఫోన్‌ చేసి…మా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు..చైనాపై అణు దాడి చేయమని ఆదేశాలు ఇచ్చే అవకాశముంది..ఒకవేళ అమెరికా దాడిచేస్తే.. చైనా వెంటనే ప్రతిదాడి చేయవద్దు అని కోరారు.

ఈ ఏడాది జనవరి 8న జనరల్ మిల్లీ మరోసారి చైనా జనరల్‌ లీ జూఛెంగ్‌కు ఫోన్‌ చేసి.. ట్రంప్‌ పదవిని వీడే సమయంలో చైనాపై దాడికి ఆదేశాలు ఇవ్వొచ్చనే విషయాన్ని చెప్పాడు. తనకు ఆదేశాలు వస్తే ముందే వెల్లడిస్తానని చైనా జనరల్‌కు మిల్లీ చెప్పారు. అంతేకాదు కీలక అమెరికా సైనిక జనరల్స్‌ను సమావేశపర్చి ట్రంప్‌ ఆదేశాలను వెంటనే అమలు చేయవద్దని మిల్లీ సూచించారు. అయితే చైనా జనరల్ కి కాల్స్‌ చేయడానికి అధ్యక్షుడి నుంచి మిల్లీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఈ విషయం మొత్తం బాబ్‌ ఉడ్‌వర్డ్‌, రాబర్ట్‌ కోస్టాలు రాసిన “పెరల్‌” అనే బుక్ లో  పేర్కొన్నారు.  ఉడ్‌వర్డ్‌ ఈ పుస్తకం రాసేందుకు గతంలో మార్క్‌ మిల్లీని ఇంటర్వ్యూ చేశారు. ఈ నెలలో ఈ బుక్ లోని  విషయాలు బయటికొచ్చాయి.

ALSO READ ఉత్తర కొరియాలో కీలక మార్పులు..కిమ్ సోదరికి అధ్యక్ష బాధ్యతలు?

అయితే తాజాగా అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్) విచారణకు జనరల్‌ మిల్లీ హాజరుకావడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు సభ్యులుగా ఉండే సెనెట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీస్‌ కమిటీ అఫ్గాన్‌ పరిణామాలతో సహా పలు అంశాలపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విచారణకు హాజరైన జనరల్ మిల్లీని..చైనాకు ఫోన్‌కాల్స్‌ వ్యవహారంపై కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అయితే యుద్ధాన్ని నివారించేందుకే అలా చేశానని జనరల్‌ మిల్లీ తాను చేసిన పని సమర్థించుకున్నారు. ఆ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించడం తన కర్తవ్యం అని సెనెటర్లకు వివరించారు. తాను చైనాకు ఫోన్ కాల్స్‌ చేసిన విషయం ట్రంప్‌ కార్యవర్గంలోని చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మెడోస్‌, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో, డిఫెన్స్‌ సెక్రటరీ మార్కె ఎస్పర్‌ లకు తెలుసని చెప్పారు.

ALSO READ  33 లక్షలు గెలుపొందిన లాటరీ టికెట్‌తో కొట్టుకొచ్చిన మృతదేహం..షాక్ అయిన పోలీసులు

జనరల్ మిల్లీ పై రిపబ్లికన్లు ఫైర్ అవుతున్నారు. అతను రాజీనామా చేయాలని లేదా అధ్యక్షుడే అతడిని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సెనెటర్‌ మార్కో రూబియో ఈ మేరకు బైడెన్‌కు ఓ లేఖ కూడా రాశారు. దీనిపై శ్వేత సౌధం స్పందిస్తూ అధ్యక్షుడు బైడెన్‌కు మిల్లీపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపింది. మిల్లీని.. ట్రంప్‌ ఆర్మీ చీఫ్‌గా నియమించారు. ఆ తర్వాత ఆయన్ను జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమించారు. బైడెన్‌ మిల్లీని కొనసాగించారు. ప్రస్తుతం బైడెన్‌ సలహాదారుల్లో మిల్లీ కూడా ఒకరు.