Indonesian : కీచక టీచర్ కు మరణ శిక్ష విధించిన ఇండోనేషియా కోర్టు

ఇండోనేషియాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు 13 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు...

Indonesian

Indonesian : ఇండోనేషియాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు 13 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇండోనేషియా కోర్టు కీచక ఉపాధ్యాయుడికి మరణ శిక్ష విధించింది. ప్రాసిక్యుటర్ చేసిన విజ్ఞప్తిని సమర్థించిన కోర్టు సోమవారం ఈ తీర్పును వెలువరించింది. ఇండోనేషియాకు చెందిన బోర్డింగ్ స్కూల్ యాజమాని హెర్రీ విరావన్ (36) పదమూడు మంది విద్యార్థులనుపై అత్యాచారం చేశాడు. వారిలో ఎనిమిది మంది గర్భం దాల్చారు. హెర్రీ విరావన్ 2006 నుంచి స్కాలర్ షిప్ లను ఆశచూపి విద్యార్థినులపై ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

Indonesian School : విద్యార్థుల ఫోన్లను మంటల్లో పారేసిన టీచర్లు.. షాకింగ్ వీడియో

బాధితులందరూ మైనర్లు, పేద కుటుంబానికి చెందిన వారు. 2022 ఫిబ్రవరి 15న ఇండోనేషియాలోని పశ్చిమ జావాలోని బాండుంగ్ జిల్లా కోర్టు హెర్రీ విరాహన్ నేరంపై విచారణ జరిపి జీవిత ఖైదు విధించింది. ప్రాసిక్యూటర్ అప్పీల్ మేరకు సోమవారం మరోసారి కేసును విచారించిన కోర్టు విరాహన్ కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ విషయంపై హరీ విరాహన్ న్యాయవాది ఇరా మాంబో మాట్లాడుతూ.. పూర్తి కోర్టు తీర్పును చూడాల్సి ఉందని, ఆ తరువాత మరోసారి అప్పీల్ దాఖలు చేయబడుతుందా లేదా అనేదారిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Indonesian : రైస్ కుక్క‌ర్‌ను పెళ్లి చేసుకున్నాడు

హెర్రీకి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం హెర్రీ బాధితుల్లో ఒకరైన మామ హిద్మత్ దిజయా మాట్లాడుతూ.. మేము మొదట జీవిత ఖైదు, లేదంటే రసాయనాలతో శిక్షను కోరుకున్నాము. తద్వారా అతను నేరం నుండి బాధను అనుభవించగలడని భావించాం. కోర్టు మరణ శిక్షతోనే న్యాయం జరుగుతుందని భావించిందని చెప్పారు.