Indonesian School : విద్యార్థుల ఫోన్లను మంటల్లో పారేసిన టీచర్లు.. షాకింగ్ వీడియో

ఇండోనేషియాలో ఓ బోర్డింగ్ స్కూళ్లో ఎంత చెప్పినా స్మార్ట్ ఫోన్లను విద్యార్థులు తీసుకొస్తున్నారంటూ టీచర్లు ఆగ్రహానికి గురయ్యారు. కోపంతో వారి ఫోన్లను లాగేసుకున్నారు...

Indonesian School : విద్యార్థుల ఫోన్లను మంటల్లో పారేసిన టీచర్లు.. షాకింగ్ వీడియో

Indonesia School

Indonesian School Teachers : విద్యార్థులను క్రమశిక్షణ, సన్మార్గంలో పెట్టడానికి టీచర్లు వివిధ రకాల పద్ధతులను ఎంచుకుంటుంటారు. అందులో కొన్ని శిక్షలు కూడా విధిస్తుంటారు. మాట వినని స్టూడెంట్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటారు. అయితే.. కొంతమంది టీచర్ల వ్యవహార శైలి వివాదాస్పదమౌతుంటాయి. విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తుంటారు. కర్రతో చితకబాదుతుండడం, బిల్డింగ్ పై నుంచి కిందకు వేలాడదీసే ఘటనలు ఇటీవలే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రాంతంలో విద్యార్థుల సెల్ ఫోన్లను మంటల్లో విసిరేశారు.

Read More : Ukraine Russia War : యుక్రెయిన్‌ పై రష్యా బాంబుల మోత.. యుక్రెయిన్‌ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇండోనేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా రెస్పాండ్ అవుతున్నారు. ఫోన్ లు తీసుకరావద్దనే నిబంధనలు పెడుతుంటాయి పలు పాఠశాలలు. అయినా కొంతమంది ఫోన్లు తీసుకొస్తుంటారు. తీసుకొచ్చినా తరగతి గదుల్లో ఓ మూలన పెట్టేస్తుంటారు. అయితే.. ఇండోనేషియాలో ఓ బోర్డింగ్ స్కూళ్లో ఎంత చెప్పినా స్మార్ట్ ఫోన్లను విద్యార్థులు తీసుకొస్తున్నారంటూ టీచర్లు ఆగ్రహానికి గురయ్యారు. కోపంతో వారి ఫోన్లను లాగేసుకున్నారు. తర్వాత ఇస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

Read More : Telangana Government : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు

ఓ కుండీని ఏర్పాటు చేసి మంటను పెట్టారు. వారి ముందే సెల్ ఫోన్లను ఒక్కొక్కటిగా అందులోకి విసిరేశారు. ప్లీజ్ మేడం వద్దు అంటున్నా వారు కనికరించలేదు. అందరికీ చూపిస్తూ.. మరీ మంటల్లో విసిరేశారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో fakta.indo పేరిట ఈ వీడియోను అప్ లోడ్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Fakta Indo | Berita Indonesia (@fakta.indo)