Telangana Government : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు

ప్రస్తుతం యుక్రెయిన్‌లో 300 మంది తెలంగాణ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ విద్యార్థుల వివరాలు తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ వివరాలను తెలంగాణ ప్రభుత్వం విదేశాంగ శాఖకు పంపనుంది.

Telangana Government : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు

Ts Govt (1)

Telangana government : యుక్రెయిన్ పై రష్యా బలగాలు మెరుపు దాడులతో విరుచుకుపడుతున్నాయి. రష్యా..యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యా ఆధీనంలోకి తీసుకుంది. రేడియోధార్మిక వ్యర్ధాల నిల్వలపై రష్యా బాంబులు పడ్డాయని యుక్రెయిన్ తెలిపింది. రేడియోధార్మికత స్థాయి ఒక్కసారిగా పేరిగిందని వెల్లడించింది.

ప్రస్తుతం యుక్రెయిన్‌లో 300 మంది తెలంగాణ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ విద్యార్థుల వివరాలు తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ వివరాలను తెలంగాణ ప్రభుత్వం విదేశాంగ శాఖకు పంపనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ నంబర్‌కు ఇప్పటికే వందలాది కాల్స్ వస్తున్నాయి.

Russian Forces : చివరి దశకు యుక్రెయిన్ ఆక్రమణ.. కీవ్‌లో ప్రవేశించిన రష్యా బలగాలు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఢిల్లీ, హైదరాబాద్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ను మంత్రి కేటీఆర్ కోరారు.

ఢిల్లీ తెలంగాణ భవన్​లో సంప్రదించాల్సిన నెంబర్లు
విక్రమ్​సింగ్​మాన్ : +91 7042566955
చక్రవర్తి పీఆర్​ఓ : +91 9949351270
నితిన్ ఓఎస్డీ : +91 9654663661
ఈమెయిల్ ఐడీ : rctelangana@gmail.com
తెలంగాణ సచివాలయంలో సంప్రదించాల్సి నెంబర్లు..
ఈ.చిట్టిబాబు ఏఎస్​ఓ : 040-23220603
ఫోన్ నంబర్ : +91 9440854433
ఈ-మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in