Ukraine Russia War : యుక్రెయిన్‌ పై రష్యా బాంబుల మోత.. యుక్రెయిన్‌ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

యుక్రెయిన్‌లో ఏ క్షణంలో ఎక్కడ బాంబు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల్లో టెన్షన్‌ పెరిగింది. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Ukraine Russia War : యుక్రెయిన్‌ పై రష్యా బాంబుల మోత.. యుక్రెయిన్‌ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

Telugu

Telugu students in Ukraine : రష్యా దాడితో యుక్రెయిన్‌లో భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యుక్రెయిన్ ఎయిర్ బేస్ మూసేయడంతో విమానాల్లో భారతీయులను అక్కడినుంచి స్వదేశానికి తరలించేవీలులేదు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి యుక్రెయిన్ బాంబుదాడులతో దద్దరిల్లుతోందని అక్కడి తెలుగు విద్యార్థిని రిషిత 10టీవీకి ఫోన్‌లో వివరించారు. ప్రస్తుతం ఆమె ఖార్కైవ్‌లో ఉన్నారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రెండు రోజుల ముందే తమకు ఆదేశాలు అందాయని ఆమె తెలిపారు.

భారత్ తిరిగి వద్దామనుకున్నా….విమాన ప్రయాణం టికెట్ల ఖర్చు భారీగా ఉందన్నారు. ప్రస్తుతం తాము ఇంటి నుంచి బయటకు రావడం లేదని, కీవ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సైతం అవకాశం లేదని అన్నారు. యుద్ధం జరుగుతున్నప్పటికీ..ప్రస్తుతం తామంతా సురక్షితంగా ఉన్నామన్నారు. యుక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ చేస్తున్నట్టు పుతిన్ ప్రకటించగానే కీవ్, ఖర్కైవ్‌లపైనే రష్యా బలగాలు ముందుగా దాడిచేశాయి. ఉదయం ఐదుగంటల ప్రాంతంలోనే బాంబు దాడులు జరిగాయని రిషిత తెలిపారు.

Russia Ukraine War : రష్యా దాడిలో 40 మంది ఉక్రెయిన్ సైనికులు, 10 మందికిపైగా సామాన్య పౌరులు మృతి

యుక్రెయిన్‌లో ఏ క్షణంలో ఎక్కడ బాంబు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల్లో టెన్షన్‌ పెరిగింది. యుక్రెయిన్ రాజధానికి దగ్గర్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. యుక్రెయిన్‌ మిలిటరీ క్యాంప్‌కి 2కిలో మీటర్ల దూరంలో ఎంబీబీఎస్‌ విద్యార్థి నకుల్‌ ఉంటున్నాడు. దీంతో తమ బాబు ఎలా ఉన్నాడోనని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి వెంటనే తమ పిల్లల్ని ఇండియాకి రప్పించాలని నకుల్ ఫాదర్‌ విశ్వనాథ్‌ కోరుతున్నారు.

యుక్రెయిన్ లోని శ్రీకాకుళం విద్యార్థులు వంశీ కృష్ణ, కుమార స్వామి నాయుడు 10టివితో మాట్లాడారు. చెర్ని విష్టిలోని బోకోవినియన్ మెడికల్ కాలేజిలో 5 సంవత్సరం మెడిసిన్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందన్నారు. వాటర్ క్యాన్లు సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించారు. విమాన సర్వీసులు ఆగిపోయాయని తెలిపారు. మార్చి15కి టిక్కెట్లు బుక్ చేశామని చెప్పారు. ఎంబసీ వారు ఏవరూ కాంటాక్ట్ అవ్వడం లేదని వాపోయారు. పరిస్థితిని ఎంబిసి వారు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారని పేర్కొన్నారు. తమను ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నామని చెప్పారు.

Indian Citizens : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. యుక్రెయిన్‌లో ఉన్న భారత పౌరుల కుటుంబీకుల్లో ఆందోళన

ఉక్రెయిన్ లో యుద్ధవాతావరణంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఉదయం బాంబుల మోతతో నిద్రలేచానని విజయవాడకు చెందిన రవితేజ అంటున్నాడు. రవితేజ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లుహాన్ సెక్ స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో రవితేజ ఎంబీబీఎస్ 5వ సంవత్సరం చదువుతున్నారు. ఉక్రెయిన్, రష్యా సరిహద్దు ప్రాంతం రుబిగ్నిలో వాతావరణం భయానకంగా మారింది. స్వదేశానికి వచ్చేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నా రాలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఉక్రెయిన్ క్యాపిటల్ ను రష్యా స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటున్నారు. మరో రెండు గంటల్లో పవర్, గ్యాస్ సప్లై నిలిపివేస్తారని తెలిపారు. రవితేజ తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతీసుకోవాలని రవితేజ తల్లి రాధా కుమారి వేడుకుంటున్నారు.

కరీంనగర్ యువతీ సుమాంజలి ఉక్రెయిన్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో చిక్కుకున్న సుమాంజలితో పాటు మరో నలుగురు విద్యార్థులు చిక్కుకున్నారు. తన కూతురుని సురక్షితంగా ఇండియాకి చేర్చాలంటూ ఎంపీ బండి సంజయ్ కి సుమాంజలి తండ్రి లేఖ రాశారు. ఈ రోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న సుమాంజలి.. ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభం అవడంతో విద్యార్థులు ఎయిర్ పోర్ట్ లోనే ఇరుక్కుపోయారు.

Indian Markets : రష్యా-యుక్రెయిన్‌ యుద్ధంతో కుప్పకూలిన భారత మార్కెట్లు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి యువతి భవాని ఉక్రెయిన్ లోని కీవ్ అనే ప్రాంతంలో ఉంది. భవాని.. మెడిసిన్ చదివేందుకు వెళ్లింది. ఉక్రెయిన్ లో తాము ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నామని తెలిపారు. తమతో పాటు హైదరాబాద్ కి చెందిన మరికొందరు ఉన్నారని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుండి వచ్చే ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. తాము దైర్యంగా ఉన్నాం ..ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు.

నల్గొండ జిల్లా విద్యార్థి ఉక్రెయిన్ లో చిక్కుకున్నాడు. మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ళ అజయ్ ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. అజయ్ మెడిసిన్ కోర్స్ మరో మూడు నెలల్లో పూర్తి కానుంది. గతంలో మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కు అజయ్ స్వయాన సోదరుడు.