Indian Citizens : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. యుక్రెయిన్‌లో ఉన్న భారత పౌరుల కుటుంబీకుల్లో ఆందోళన

తమవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. యుద్ధం జరుగుతుండటంతో .. తమ పిల్లలను వెనక్కి రప్పించాలంటూ ఎంబసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Indian Citizens : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. యుక్రెయిన్‌లో ఉన్న భారత పౌరుల కుటుంబీకుల్లో ఆందోళన

Delhi

Indian citizens in Ukraine : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో.. యుక్రెయిన్‌లో ఉంటున్న భారత పౌరుల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. అయినవారి వివరాల కోసం ఢిల్లీలోని యుక్రెయిన్‌ ఎంబసీ దగ్గరకు వస్తున్నారు. తమవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. యుద్ధం జరుగుతుండటంతో .. తమ పిల్లలను వెనక్కి రప్పించాలంటూ ఎంబసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

రష్యా దాడితో యుక్రెయిన్‌లో భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యుక్రెయిన్ ఎయిర్ బేస్ మూసేయడంతో విమానాల్లో భారతీయులను అక్కడినుంచి స్వదేశానికి తరలించేవీలులేదు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి యుక్రెయిన్ బాంబుదాడులతో దద్దరిల్లుతోందని అక్కడి తెలుగు విద్యార్థిని రిషిత 10టీవీకి ఫోన్‌లో వివరించారు. ప్రస్తుతం ఆమె ఖార్కైవ్‌లో ఉన్నారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రెండు రోజుల ముందే తమకు ఆదేశాలు అందాయని ఆమె తెలిపారు.

Ukraine Ambassador : యుక్రెయిన్ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకోవాలి : రాయబారి

భారత్ తిరిగి వద్దామనుకున్నా….విమాన ప్రయాణం టికెట్ల ఖర్చు భారీగా ఉందన్నారు. ప్రస్తుతం తాము ఇంటి నుంచి బయటకు రావడం లేదని, కీవ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సైతం అవకాశం లేదని అన్నారు. యుద్ధం జరుగుతున్నప్పటికీ..ప్రస్తుతం తామంతా సురక్షితంగా ఉన్నామన్నారు. యుక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ చేస్తున్నట్టు పుతిన్ ప్రకటించగానే కీవ్, ఖర్కైవ్‌లపైనే రష్యా బలగాలు ముందుగా దాడిచేశాయి. ఉదయం ఐదుగంటల ప్రాంతంలోనే బాంబు దాడులు జరిగాయని రిషిత తెలిపారు.

క్షణక్షణం..భయంభయం.. అనుక్షణం బులెట్ల వర్షం.. అడుగుతీసి అడుగు బయటకు వేస్తే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి.. ప్రపంచ దేశాలన్నీ ప్రతిఘటిస్తున్నా.. యుద్ధానికి కాలుదువ్విన రష్యా.. యుక్రెయిన్‌ను ప్రమాదంలో పడేసింది. రష్యా దాడితో యుక్రెయిన్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అటు రాజధాని కీవ్‌ను ప్రజలు పెద్దసంఖ్య కీవ్‌ను వీడుతున్నారు. కొన్నిచోట్ల అండర్ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపుగా తూర్పు యుక్రెయిన్‌ మొత్తాన్ని ఆక్రమించింది రష్యా. బాంబుల మోతలు, క్షిపణుల దాడులతో నగరాలు దద్దరిల్లుతున్నాయి.

Russia-Ukraine War : స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తున్న రష్యా, యుక్రెయిన్ వార్

యుక్రెయిన్‌లో జనావాసాలపైనా రష్యా దాడులు చేస్తునట్లుగా తెలుస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌ సముదాయంపై రష్యా యుద్ధవిమానం దాడి చేసిటనట్లుగా సమాచారముంది. రష్యా దాడుల్లో ఏడుగురు చనిపోయినట్టు యుక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. అయితే అనధికారికంగా వందలమంది యుక్రెయిన్ సైనికులు మరణించి ఉంటారని అంచనాలు వెల్లడవుతున్నాయి. మరోవైపు యుక్రెయిన్‌లో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని భారతీయుల్ని కోరింది ఇండియన్‌ ఎంబసీ. రాజధాని కీవ్ వైపు ఎవరూ వెళ్లొద్దని సూచించింది. ఇక మనీ విత్‌డ్రాయల్‌పై సెంట్రల్ బ్యాంక్ లిమిట్‌ పెట్టింది. రోజుకు రెండున్నర లక్షలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ప్రజలు ఏటీఎం సెంటర్ల దగ్గర బారులు తీరారు.

నిన్న మొన్నటిదాకా అమెరికా హెచ్చరికలతో ఒక కాలు వెనక్కి వేసినట్లు కనిపించిన రష్యా.. ఇప్పుడు ఏకంగా 10 అడుగులు ముందుకేసింది. యుక్రెయిన్‌ను ఊపిరిపీల్చుకోకుండా ప్లాన్ చేసిన రష్యా ఎయిర్‌ బేస్‌లపై దాడి చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లపై అటాక్ చేస్తోంది. విద్యుత్ వ్యవస్థనూ కుప్పకూల్చుతోంది. ఇవన్నీ చూస్తుంటే.. పక్కా ప్రణాళికతో రష్యా దాడికి దిగినట్లు అర్థం అవుతుంది. మరోవైపు మూడు వైపుల నుంచీ రష్యా చుట్టుముట్టినా.. యుక్రెయిన్ తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. రష్యా బలగాలకు దీటుగా బదులిస్తోంది. రష్యా 5 యుద్ధవిమానాలు, హెలికాప్టర్‌ను కూల్చేసినట్టు యుక్రెయిన్ ప్రకటించింది. యుక్రెయిన్ మూడు వైపుల నుంచీ రష్యా విరుచుకుపడింది. తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపు నుంచీ రష్యా బలగాలు దాడి చేశాయి. అటు పెద్దసంఖ్యలో ప్రజలు యుక్రెయిన్‌ను వీడి వెళ్తున్నారు.