Russia-Ukraine War : స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తున్న రష్యా, యుక్రెయిన్ వార్

స్టాక్‌మార్కెట్లలోని అన్ని ఇండెక్స్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌, ఐటీ, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, కన్జ్యూమర్‌ గూడ్స్‌ ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

Russia-Ukraine War : స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తున్న రష్యా, యుక్రెయిన్ వార్

Stock Market

Huge losses to stock markets : ప్రపంచ మార్కెట్లను రష్యా, యుక్రెయిన్ యుద్ధం కుదిపేస్తోంది. భారతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతకంతకు నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో 2వేల పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ ఆ తర్వాత కాస్త కుదురుకున్నట్లు కనిపించింది. ఆ తర్వాత మళ్లీ మరోసారి 2వేల పాయింట్లు కోల్పోయింది. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అమెరికా కూడా యుద్ధంలోకి దిగితే ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందన్న భయాలున్నాయి. యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్భణం పెరుగుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. బంగారం పెట్టుబడులపై దృష్టి పెట్టడంతో బంగారం ధర పెరిగింది.

స్టాక్‌మార్కెట్లలోని అన్ని ఇండెక్స్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌, ఐటీ, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, కన్జ్యూమర్‌ గూడ్స్‌ ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్‌, టాటామోటర్స్‌ 7శాతానికి పైగా నష్టపోయాయి. UPL, ఇండస్‌ ఇండ్‌, గ్రాసిమ్‌, ఎం అండ్‌ ఎం, అదానీ పోర్ట్‌ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంత నష్టాల్లోనూ ఒక్క హిందాల్కో ఒక్కటే లాభాల్లో ట్రేడవుతోంది. ఇటు క్రూడ్‌ ధర మాత్రం మండుతోంది. ఏకంగా 103 డాలర్లను టచ్ చేసింది. ఈ ఒక్కరోజే దాదాపు ఆరు డాలర్లు పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే క్రూడ్‌ ఆయిల్‌ ధర మరింత భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Petrol Prices: భారత్‌కి బ్యాడ్ న్యూస్, యుద్ధం దెబ్బకు భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ప్రపంచ దేశాలు భయపడిందే జరుగుతోంది. కొన్ని రోజులుగా యుక్రెయిన్‌పై దాడికి సన్నాహాలు చేపట్టిన రష్యా.. తన వ్యూహాన్ని ఇప్పుడు పకడ్బందిగా అమలు చేస్తోంది. యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగింది రష్యా. అన్ని వైపుల నుంచి యుక్రెయిన్‌పై దాడి చేస్తోంది. యుక్రెయిన్‌ సైన్యం, సైనిక స్థావరాలు, మిలటరీ బేస్‌లే టార్గెట్‌గా రష్యా దళాలు దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే యుక్రెయిన్‌ మిలటరీ స్థావరాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. అటు యుక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాల ఆక్రమణ దిశగా రష్యా సైన్యం కదులుతోంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై వైమానిక దాడులు చేస్తోంది. రష్యా సైన్యం అధీనంలోకి ఇప్పటికే కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ వెళ్లిపోయింది. అటు యుక్రెయిన్ పవర్‌ప్లాంట్లపై రష్యా వైమానిక దాడులు జరుపుతోంది. మరోవైపు యుక్రెయిన్‌ ప్రభుత్వ వెబ్‌సైట్లపై రష్యా సైబర్‌ ఎటాక్‌ చేసింది.

అటు యుక్రెయిన్-బెలారస్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. బెలారస్‌ సహకారంతోనే రష్యా దాడికి దిగింది. బెలారస్‌ నుంచే యుక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఇక ఇళ్లలో నుంచి ప్రజలెవర్నీ బయటకు రావొద్దని యుక్రెయిన్‌ తమ పౌరులను హెచ్చరించింది. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దేశమంతా మార్షల్‌ లా అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది మరోవైపు యుక్రెయిన్‌కు మద్దతుగా నాటో దళాలు రంగంలోకి దిగనున్నాయి. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం తర్వాత నాటో దళాలు దిగనున్నాయి. ఇక ప్రపంచదేశాలు రష్యా తీరుపై మండిపడుతుంటే తన చర్యను మాత్రం రష్యా సమర్థించుకుంటోంది. చీకట్లో మగ్గిపోతున్న యుక్రెయిన్‌ ప్రజలను కాపాడేందుకే సైనికచర్య అంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా రష్యా తన చర్యను సమర్ధించుకుంది.
War in Ukraine: నిముషాల వ్యవధిలో మారిపోతున్న పరిణామాలు: యుక్రెయిన్ వైమానిక, మిలిటరీ స్థావరాలే లక్ష్యమన్న రష్యా

తూర్పు యుక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేయడంతో ప్రపంచదేవాలు ఉలిక్కిపడ్డాయి. యుక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు పుతిన్‌. ఆపరేషన్‌లో జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని పరోక్షంగా అమెరికా సహా నాటో దేశాలకు పుతిన్ హెచ్చరికలు పంపారు. ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. వేర్పాటువాద ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు సైనిక ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు.

యుక్రెయిన్ వేర్పాటువాదులు లొంగిపోవాలని సూచించారు. బెదిరింపులను రష్యా ఎప్పుడూ సహించబోదని పుతిన్ స్పష్టం చేశారు. యుక్రెయిన్‌ను ఎన్నడూ రష్యా స్వాధీనం చేసుకోబోదన్నారు పుతిన్. రక్తపాతానికి యుక్రెయిన్‌ పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అయితే పుతిన్‌ వ్యాఖ్యలకు విరుద్దంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. రష్యా దళాలు యుక్రెయిన్‌ టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు.