Ukraine Ambassador : మోదీ శక్తిమంతుడు.. ఆయనొక్కడే పుతిన్‌ను ఆపగలడు : యుక్రెయిన్ రాయబారి

రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని, పుతిన్‌తో మోదీ మాట్లాడి పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని కోరారు. యుక్రెయిన్ అధ్యక్షునితోనూ ప్రధాని మోదీ మాట్లాడాలని ఆయన కోరారు.

Ukraine Ambassador : మోదీ శక్తిమంతుడు.. ఆయనొక్కడే పుతిన్‌ను ఆపగలడు : యుక్రెయిన్ రాయబారి

Ukraine

Ukraine affair : యుక్రెయిన్ వ్యవహారంలో భారత్ కల్పించుకోవాలని ఢిల్లీలో ఆ దేశ రాయబారి కోరారు. యుక్రెయిన్ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని, పుతిన్‌తో మోదీ మాట్లాడి పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని కోరారు. యుక్రెయిన్ అధ్యక్షునితోనూ ప్రధాని మోదీ మాట్లాడాలని ఆయన కోరారు. నిన్న మొన్నటిదాకా అమెరికా హెచ్చరికలతో ఒక కాలు వెనక్కి వేసినట్లు కనిపించిన రష్యా.. ఇప్పుడు ఏకంగా 10 అడుగులు ముందుకేసింది.

యుక్రెయిన్‌ను ఊపిరిపీల్చుకోకుండా ప్లాన్ చేసిన రష్యా ఎయిర్‌ బేస్‌లపై దాడి చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లపై అటాక్ చేస్తోంది. విద్యుత్ వ్యవస్థనూ కుప్పకూల్చుతోంది. ఇవన్నీ చూస్తుంటే.. పక్కా ప్రణాళికతో రష్యా దాడికి దిగినట్లు అర్థం అవుతుంది. మరోవైపు మూడు వైపుల నుంచీ రష్యా చుట్టుముట్టినా.. యుక్రెయిన్ తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. రష్యా బలగాలకు దీటుగా బదులిస్తోంది. రష్యా 5 యుద్ధవిమానాలు, హెలికాప్టర్‌ను కూల్చేసినట్టు యుక్రెయిన్ ప్రకటించింది. యుక్రెయిన్ మూడు వైపుల నుంచీ రష్యా విరుచుకుపడింది. తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపు నుంచీ రష్యా బలగాలు దాడి చేశాయి. అటు పెద్దసంఖ్యలో ప్రజలు యుక్రెయిన్‌ను వీడి వెళ్తున్నారు.

Russia-Ukraine War : స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తున్న రష్యా, యుక్రెయిన్ వార్

యుక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాల ఆక్రమణ దిశగా రష్యా సైన్యం కదులుతోంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై వైమానిక దాడులు చేస్తోంది. రష్యా సైన్యం అధీనంలోకి ఇప్పటికే కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ వెళ్లిపోయింది. అటు యుక్రెయిన్ పవర్‌ప్లాంట్లపై రష్యా వైమానిక దాడులు జరుపుతోంది. మరోవైపు యుక్రెయిన్‌ ప్రభుత్వ వెబ్‌సైట్లపై రష్యా సైబర్‌ ఎటాక్‌ చేసింది. అటు యుక్రెయిన్-బెలారస్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. బెలారస్‌ సహకారంతోనే రష్యా దాడికి దిగింది. బెలారస్‌ నుంచే యుక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఇక ఇళ్లలో నుంచి ప్రజలెవర్నీ బయటకు రావొద్దని యుక్రెయిన్‌ తమ పౌరులను హెచ్చరించింది.

అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దేశమంతా మార్షల్‌ లా అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది మరోవైపు యుక్రెయిన్‌కు మద్దతుగా నాటో దళాలు రంగంలోకి దిగనున్నాయి. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం తర్వాత నాటో దళాలు దిగనున్నాయి. ఇక ప్రపంచదేశాలు రష్యా తీరుపై మండిపడుతుంటే తన చర్యను మాత్రం రష్యా సమర్థించుకుంటోంది. చీకట్లో మగ్గిపోతున్న యుక్రెయిన్‌ ప్రజలను కాపాడేందుకే సైనికచర్య అంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా రష్యా తన చర్యను సమర్ధించుకుంది.