Tree
New Zealand Indoor plant : ఆ మొక్కకు 8 ఆకులు మాత్రమే ఉంటాయి. ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటుంటారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కను ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా..రూ. 14 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారో ఓ వ్యక్తి. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. వేలం ద్వారా ఈ మొక్కను కొనుగోలు చేశారు.
తెలుపు రంగులో ఉండే రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అనే ఈ మొక్కను న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ ట్రైడ్ మి వేదికగా.. వేలం నిర్వహించారు. ఆక్లాండ్ కు చెందిన ఓ వ్యక్తి..రూ. 14 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అనే ఈ మొక్క ప్రతి ఆకులో కాండం వలే అద్భుతమైన వైవిధ్యత ఉంటుందని ట్రేడ్ మి వెల్లడించింది.
ఈ మొక్క థాయ్‌లాండ్, మలేషియాలకు చెందినదని తెలుస్తోంది. అరుదైన మొక్కకు లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం విశేషం. మొక్కల పట్ల..న్యూజిలాండ్ వాసులకు ఎంతో ప్రేమ ఉంటుందని దీనిని బట్టి తెలుస్తోందని ట్రేడ్ మి ప్రతినిధి మిల్లీ సిల్వెస్టర్ వెల్లడించారు.