‘I Want to Go to Prison’ : నా భార్యతో ఉంటే నరకంలో ఉన్నట్లుంది..నన్ను జైల్లో వేయండీ సార్..

నా భార్యతో ఉంటే నరకంలో ఉన్నట్లుంది..నన్ను జైల్లో వేయిండీ సార్.. అంటూ పోలీసులను అభ్యర్థించాడు ఓవ్యక్తి, దీంతో అధికారులు జైలుకు తరలించాలని ఆదేశించారు.

‘I Want to Go to Prison’ : ఇల్లు, భార్య, పిల్లలు ఇలా బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి కొంతమంది దొంగనాటకాలు ఆడుతుంటారు. మరికొందరు తిరుగు నేరాలు చేస్తు తప్పుడు పనులు చేస్తు జైల్లో ఉండి బయటకొచ్చి ఇంట్లో ఉండటం నచ్చక తిరిగి జైలుకు వెళ్లిపోదామనుకుంటారు. ఇటువంటివారి వారి బాధ్యతలనుంచి తప్పించుకోవటానికే ఇలా చేస్తుంటారు. అచ్చం అటువంటి ఓ వ్యక్తి ‘‘నేను ఇంటిలో ఉండలేను నా భార్యతో కలిసి ఉండటం నా వల్ల కాదు..దయచేసి నన్ను జైల్లో పడేయండి సార్’’ అంటూ పోలీసులను వేడుకున్నాడు. మరి అతని భార్య గయ్యాళా? లేదా హింసలు పెడుతోందా? అంటూ అదీకాదు. మరి ఎందుకు అతను జైలుకు వెళ్లాలనుకుంటున్నాడంటే..

Read more :Pollock Sisters Mystery : కారు ప్రమాదంలో చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున కవలలుగా పుట్టిన అక్కచెల్లెళ్లు..

ఇటలీకి చెందిన ఓ వ్యక్తి స్వేచ్చగా ఉండటం కోసం కుటుంబానికీ దూరంగా జైల్లో ఉండాలనుకుంటున్నాడు. అంతేకాదండోయ్‌ నన్ను జైల్లో పెట్టండి అంటూ పోలీసులను కూడా అభ్యర్థించాడు. గైడోనియా మాంటెసిలియోలో నివసిస్తున్న 30 ఏళ్ల అల్బేనియన్ ఇంట్లో తన భార్యతో కలిసి జీవించలేనని..ఇంట్లో ఉండటం నాకు నరకంగా ఉంటోందని..నన్ను జైల్లో వేయండీ సార్ అంటూ కారబినీరి పోలీసులకు విన్నవించుకున్నాడు. అంతేకాదు ఈ కుటుంబ జీవితం నాకు విసుగు వచ్చేసిందని ఇంకెప్పుడు ఇంటికి రావాలని తాను అనుకోవట్లేదని ..నా భార్య నుంచి తప్పించుకోవడం కోసం నన్ను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడు. అ విషయాన్ని సాక్షాత్తు పోలీసులు తెలిపారు.

Read more : ‘tripping talent’: ఏం చిత్రాలమ్మో.. మరీ విచిత్రంగా ఉన్నాయే.. చూసేయండీ ఓ మారు!

ఈ వింత ఘటనపై టివోలి కారబినీరికి చెందిన పోలీస్‌ కెప్టెన్‌ ఫ్రాన్సిస్కో గియాకోమో ఫెర్రాంటే మాట్లాడుతూ…అల్బేనియన్ అనే వ్యక్తిపై మాదకద్రవ్యాల నేరం కింద కేసు ఉంది. అతడిని హౌస్ అరెస్ట్ చేశాం. (అక్కడ కొన్ని శిక్షలకు గృహ నిర్బంధం విధించటం మామూలే) కానీ అతని గృహనిర్భం శిక్ష ఇంకా పూర్తి కాలేదు. కానీ అతను మాత్రం తాను ఇంట్లో ఉండలేనని నాకు ఇంటిలో ఉండేకంటూ జైలులో ఉండటమే నయం అని అక్కడే నాకు ప్రశాంతంగా ఉంటుందనీ కాబట్టి తనను జైలుకు పంపించాలని అభ్యర్థిస్తున్నాడని తెలిపారు.ఇదిలా ఉంటే..పోలీసులు గృహ నిర్భంధాన్ని ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి..జైలుకు తరలించాలని న్యాయశాఖ అధికారులు ఆదేశించారని పోలీసులు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు