Pollock Sisters Mystery : కారు ప్రమాదంలో చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున కవలలుగా పుట్టిన అక్కచెల్లెళ్లు..

కారు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు అక్కచెల్లెళ్లు మళ్లీ అదే తల్లి కడుపున కవలలుగా పుట్టిన ఆడపిల్లలు పునర్జన్మ మిస్టరీ కథ..సైన్సుకే అందని పునర్జన్మ కథ..

Pollock Sisters Mystery : కారు ప్రమాదంలో చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున కవలలుగా పుట్టిన అక్కచెల్లెళ్లు..

Pollock Sisters Reincarnation Story

Pollock Sisters Reincarnation Story : మనిషి చనిపోయాక ఏమవుతాడు? పునర్జన్మ ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతోంది. కొంతమంది తమకు పునర్జన్మ గుర్తుకొచ్చిందని వాటికి సంబంధించిన పలు ఆసక్తికర ఘటనలు చెబుతున్నారనే వార్తలు విన్నాం. చదివాం. కానీ అవి ఎంత వరకు నిజాలో తెలియవు. కానీ ప్రస్తుత ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఎన్నో మిస్టరీలు మిస్టరీలుగా మిగిలిపోతున్నాయి. ఎన్నో మిస్టరీలె సైన్స్ కు కూడా అందటంలేదు. అటువంటి ఈ స్మార్ట్‌ యుగాన్ని సైతం అబ్బురపరచే కొన్ని గత సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. పునర్జన్మ నమ్మకాలను బలపరచేలా కొన్ని ఘటనలు ఉంటున్నాయి. అటువంటిదే ‘పొల్లాక్‌ సిస్టర్స్‌’ కథ ఒకటి. సైన్స్‌కే అందని ఓ అద్భుతం ఈ అక్కచెల్లెళ్ల కథ. ఈ అక్కచెల్లెళ్లు ఇద్దరు ఓ కారు ప్రమాదంలో కొన్నాళ్ల క్రితం చనిపోయారు. తిరిగి అదే తల్లికి కవలపిల్లలుగా జన్మించారు. ఇది నిజమా కాదా? అని చాలామంది అనుకోవద్దు. కానీ వారి తల్లి స్వయంగా వారి మాటలు.చేష్టలు చూసి మాటరాక నిజమేనా?అని కన్నతల్లే నమ్మే ఘటనలు జరిగాయి. మరి ఈ ‘పొల్లాక్‌ సిస్టర్స్‌’ మిస్టరీ పునర్జన్మ కథ ఏంటో తెలుసుకోవాల్సిందే..!

అమెరికాకు చెందిన వారిద్దరు అక్కాచెల్లెళ్లు. 1957లో కారు యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ ఇద్దరూ.. తిరిగి కొన్ని ఏళ్లకు అంటే దాదాపు ఏడేళ్లకు అంటే 1964లో మళ్లీ పుట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ తల్లి బిడ్డలు వారి చనిపోయారో వారు మళ్లీ అదే తల్లి కడుపున కవలలుగా పుట్టారు. వారు పెరిగి పెద్ద అయ్యాక వారు మాట్లాడే మాటలను బట్టి గతజన్మ సంఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడంతో ఒక్కసారిగా వారి తల్లే షాక్ అయ్యింది. ఇక జనాలైతే వారి ఆశ్చర్యాలకు అంతులేదు. ఎంతోమంది సైంటిస్టులు కూడా వీరి పుట్టుక వారి చావు. వారి గత జన్మ విషయాలు చెబుతుంటే అవి నిజమేని వారి తల్లి చెబుతుంటే విని ఆశ్చర్యపోయారు. ఇదెలా సాధ్యం అని సైంటిస్టుల నోటివెంట మాటలు కూడారాని పరిస్థితి. పరిశోధకులు సైతం సమాధానం చెప్పలేని స్థితిలో.. ఈ ‘పొల్లాక్‌ సిస్టర్స్‌’ పునర్జన్మ కథ ఓ మిస్టరీగా మారింది.

వారు ఎలా చనిపోయారు?
జొవాన్నా పొల్లాక్, జాక్వెలిన్‌ పొల్లాక్‌ అనే అమెరికన్‌ అక్కచెల్లెళ్లు. జాన్‌–ఫ్లోరెన్స్‌ అనే దంపతులకు 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్‌ జన్మించారు. వీరిలో జొవాన్నా పెద్దది. అంటే అక్క. జాక్వెలిన్‌ చిన్నది. జొవొన్నాకు చెల్లెలు జాక్వెలిన్ అంటే ప్రాణం. తల్లిలా చూసుకునేది. అయితే జాక్వెలిన్‌ పుట్టిన ఆరేళ్లకు చర్చ్‌ రోడ్‌లో స్నేహితుడు ఆంథోనీతో కలిసి నడుస్తున్న జొవాన్నా, జాక్వెలిన్ ల మీదకి ఓ కారు దూసుకొచ్చింది. ఆ ప్రమాదంలో ముగ్గురూ ఆంథోనీతో పాటు ఇద్దరు అక్కచెల్లెళ్లు అక్కడికక్కడే చనిపోయారు. అప్పటికి జొవొన్నా కు 11, జాక్వెలిన్ కు 6 ఏళ్లు. ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకుని జాన్- ప్లోరెన్స్ ఎంతో కుమిలిపోయారు. కాలం గడిచేకొద్ది ఆ బాధనుంచి కోలుకున్నారు. తరువాత 1964లో ఫ్లోరెన్స్‌ మళ్లీ తల్లి అయ్యింది. భార్య గర్భంతో ఉండగా జాన్ తన భార్య గర్భంలో కవలలు ఉన్నారని నమ్మేవాడు.

ఫ్లోరెన్స్‌ని చెకప్‌ చేసిన డాక్టర్స్‌.. బ్ల్లడ్‌లైన్స్‌ ఆధారంగా కవలలు ఉండే అవకాశమే లేదని చెప్పినా సరే.. జాన్‌ తన నమ్మేవాడు కాదు. నాకు కవలపిల్లలే పుడతారని పదే పదే చెప్పేవాడు. అదే నిజమైంది. ఫ్లోరెన్స్ పండంటి ఆడ కవల్ని కన్నది. వారి పుట్టుకతో జాన్ దంపతులు మెల్లగా యాక్సిడెంట్‌ విషాదాన్ని మరచిపోవడం మొదలుపెట్టారు. కవలలకు గిలియన్, జెన్నిఫర్‌ అని పేర్లు పెట్టుకుని కంటికిరెప్పలాగా పెంచుకుంటున్నారు. వారి పెరుగుతున్నారు. బుడి బుడి అడుగులతో.. బోసి మాటలతో మళ్లీ కుటుంబంలో సంతోషాలు మొదలయ్యాయి. కవల పిల్లల ఆలనా పాలనలో వారిరి వారాలు నెలలు గడిచిపోతున్నాయి.

ఒకరోజు గిల్లియన్, జెన్నిఫర్‌లకు మాటలొచ్చాయి. చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నారు.తమకు ఏం కావాలో తల్లిని అడుగుతున్నారు. బిడ్డలు అడిగిందే తడవుగా అమ్మానాన్నలు ఏది అడిగితే అది తెచ్చిపెట్టేస్తున్నారు. అలా పెరిగిన గిల్లియన్, జెన్నిఫర్ లు ఓరోజు తల్లి ఫ్లోరెన్స్ ని ఫలానా బొమ్మలు కావాలి..అవి మన ఇంటి పైనా ర్యాక్ లో ఉన్నాయి అవికావాలని అడిగారు. దానికి ప్లోరెన్స్ ఆశ్చర్యపోయింది. ఆ బొమ్మలు అక్కడ ఉన్నట్లు చనిపోయిన తన బిడ్డలకు..తమకు తప్ప ఎవ్వరికి తెలీదు. ఇంత చిన్నపిల్లలు వీరికెలా తెలిసిందా అని అనుకుంది. పైకి మాత్రం అవి పాత బొమ్మలు కదా..మీకు కొత్త బొమ్మలు కొనిపెడతాను అని చెప్పింది.దానికి వారిద్దరు కాదు అవి మా బొమ్మలుమాకు అవే కావాలి అని అడిగారు.దానికి తల్లి మరోసారి ఆశ్చర్యపోయింది. పిల్లల కోరిక కాదనలేక తీసి ఇచ్చింది.

వాటిని చూసిన ఆ పిల్లలు తెగ ఆనందపడియారు. చెల్లీ ఇవి మన బొమ్మలే కదూ..మనం వీటితోనే కదా అప్పుడు ఆడుకునేవాళ్లం అనుకుంటు..బొమ్మల్ని పంచుకున్నారు. ‘‘జొవాన్నా..ఇవి నీ బొమ్మలు అని జొవాన్నా బొమ్మల్ని గిల్లియన్, జాక్వెలిన్‌ బొమ్మల్ని జెన్నిఫర్‌ పంచుకున్నారు. ఇదంతా వాళ్ల 3 ఏళ్ల వయసులో జరిగింది. ఆ ఘటన చూసిన తల్లి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఘటన మర్చిపోకముందే మరో ఘటన..

చనిపోయిన ఇద్దరి పిల్లల ఫొటోని చూసిన ఆ కవలలు గిల్లియన్, జెన్నిఫర్‌లు ‘ఇది నువ్వు.. ఇది నేను’ అని ఫోటోలు చూపిస్తు చెప్పుకోవటం తల్లి కళ్లారా చూసింది. ఇది పిల్లల మాటలు విన్న ఫ్లోరెన్స్‌కి.. కాళ్ల కింద నేల కంపించినట్లైంది. గాబరాపడిపోయింది. ఏంటీ చిత్రం అని తెగ ఆశ్చర్యపోయింది. దాంతో ఆ ఫోటోని దాచిపెట్టేసింది పిల్లల కంట పడకుండా.అయితే కవలల్లో గిల్లియన్‌.. గత జన్మలోని జొవాన్నా మాదిరే మంచి మనస్సుతో ఉండేదట. అంతేకాదు బట్టలు వేసుకునే తీరు..మాటతీరు అంతా తన చెల్లెలు జెన్నిఫర్‌తో పోల్చినప్పుడు చాలా పరిపక్వతతో అంటే కాస్త పెద్దరికంగా ఉంటు చెల్లెల్ని చూసుకుంటు కనిపించేదట. ఎందుకంటే తన గత జన్మలో తన చెల్లెలు జాక్వెలిన్‌ కంటే సుమారు ఐదారేళ్లు పెద్దది.దాంతో చెల్లెలంటే జొవన్నాకు జాక్వెలిన్ అంటే ప్రాణం.

మరోసారి తమ కవల పిల్లలతో కలిసి జాన్‌ దంపతులు బయటకు వెళ్లారు. అక్కడ గతంలో జొవాన్నా, జాక్వెలిన్‌లు చదివిన స్కూల్‌ని, యాక్సిడెంట్‌ అయిన ప్లేస్‌ని ఈ కవలపిల్లలు గుర్తుపట్టారు. అప్పటి విషయాలు వారుచెప్పుకోవటం జాన్ దంపతులు విన్నారు. ఈ కవలపిల్లలు అప్పటిదాకా ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి చూసిన వెంటనే ఏదో తమకు ఆ ప్రాంతం తెలిసినట్లుగాను..ఆ రోడ్డుపై పిల్లలు వెళ్తున్నప్పుడు కారు కనిపిస్తే.. తమవైపే దూసుకొస్తుందని ఏడ్చేవారట.ఇలా ఐదారేళ్లు వచ్చేదాకా అచ్చం చనిపోయిన జొవాన్నా, జాక్వెలిన్‌లానే ప్రవర్తించేవారు కవలలు. అలా ఆ తల్లిదండ్రులకు ఎన్నో ఘటనలు గతంలో తమ ఆడపిల్లల మాదిరిగానే వీరి ప్రవర్తన, మాట్లాడుకునే తీరు.. అలనాటి వారి జ్ఞాపకాల గురించి చెబుతుంటే జాన్ దంపతులు ఓ క్లారిటీకి వచ్చేశారు. చనిపోయిన తమ పిల్లలే గిల్లియన్, జెన్నిఫర్‌ల్లా పుట్టారని నమ్మడం మొదలుపెట్టారు ఒక్కో ఘటనా జరుగుతుంటే.

అదివారికి చాలా ఆనందాన్నిచ్చింది.తమ అనుభవాలను అందరితో పంచుకోవడం మొదలుపెట్టారు. అది విన్న వారి స్నేహితులు, బంధువులు పోనీలే పోయిన మీ పిల్లలు మీకే పుట్టారు అని అనేవాటర. కానీ కవలలకు ఏడేళ్ల వయసు వచ్చేసరికి.. గత జన్మ స్మృతులని పూర్తిగా మరచిపోయారు. మామూలు పిల్లల్లాగానే ఉండటం మొదలుపెట్టారు.కానీ అదెలా సాధ్యం అనేది మాత్రం ఇప్పటికే అంతుచిక్కలేదు.ఈ పొల్లాక్‌ సిస్టర్స్‌ పునర్జన్మ ఓ కట్టుకథ అని కొంతమంది కొట్టిపారేసేవారు. కాని వారి సన్నిహితులు మాత్రం నమ్మేవారు. ఎందుకంటే ఆ పిల్లల్ని దగ్గరనుంచి చూసేవారు. చనిపోయిన జొవాన్నా, జాక్వెలిన్ లు ఎలా ఉండేవారు వారికి తెలుసు కాబట్టి.

అమెరికన్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ ఇయాన్‌ స్టీవెన్సన్‌.. పునర్జన్మలు, గత జన్మ జ్ఞాపకాలపై పలు పరిశోధనలు చేశారు. 1963 నుంచి ఇయాన్ ఇటువంటివాటిపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. అలా ఆయన అప్పటినుంచి కొన్ని వేల కేసుల్ని స్టడీ చేశారు. ఈక్రమంలో ఇయాన్ కవలలకు 20 ఏళ్లున్న సమయంలో వారిని కలిసాడు. ఆ తరువాత కొంతకాలానికి కవలల తల్లి ప్లోరెన్స్ చనిపోయాక కూడా ఇయాన్ కవలలను కలిసాడు. 1987లో ఇలాంటి 14 ఆసక్తికర సంఘటనలతో ‘చిల్డ్రన్స్‌ హూ రిమెంబర్‌ దెయిర్‌ పాస్ట్‌ లైవ్స్‌ (గత జన్మలను గుర్తుపెట్టుకున్న పిల్లలు)’ అనే పుస్తకం కూడా రాశారు.

కచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని, అందులో పొల్లాక్‌ సిస్టర్స్‌ కథ కూడా నిజమేనని వారేమి కట్టుకథలు చెప్పటం లేదని వెల్లడించారు. కాగా.. అమెరికన్లకు ఏలియన్స్, టైమ్‌ ట్రావెల్స్‌తో పాటు ఆత్మలన్నా, దెయ్యాలన్నా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. చనిపోయిన వారు మళ్లీ తిరిగి పుడతారని అమెరికన్లు బాగా నమ్ముతారు.ఏది ఏమైనా ఈ పొల్లాక్‌ సిస్టర్స్‌ మిస్టరీ కథ మాత్రం నేటికీ ఆసక్తికరంగానే ఉంది.