‘tripping talent’: ఏం చిత్రాలమ్మో.. మరీ విచిత్రంగా ఉన్నాయే.. చూసేయండీ ఓ మారు!

అంతర్జాతీయ త్రీడీ పెయింటింగ్‌ కళాకారిణీ, వరల్డ్‌ రికార్డు గ్రహీత అయిన శిఖా శర్మ.తన 'ట్రిప్పింగ్' ప్రతిభతో దృష్టిని మరల్చినివ్వని కనికట్టుతో అ‍త్యంత అద్భుతమైన ప్రతిభ చూసి తీరవలసిందే

‘tripping talent’: ఏం చిత్రాలమ్మో.. మరీ విచిత్రంగా ఉన్నాయే.. చూసేయండీ ఓ మారు!

Shikha Sharma Tripping Talent

Updated On : October 26, 2021 / 6:02 PM IST

Artist’s ‘tripping talent’ : ఎవరన్నా కుంచెతో పెంయింటింగ్ వేస్తారు. ఇసుకతో వేస్తారు. సుద్దతో గీస్తారు. గోరుతో కూడా వేస్తారు. కానీ ఇక్కడ చూసే చిత్రాలు మాత్రం బహుశా ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. ఒక చిత్రం క్షణ క్షణానికి మారిపోతుంది. ఇది కలా నిజమా? అనుకునేలోగా మరో చిత్రంగా మారిపోయే ఇచిత్రాల చిత్రాలు ఈ చిత్రాల ప్రత్యేకత. ఇది చిత్రమా? లేకా కనికట్టా? అని మన కళ్లను మనమే నమ్మలేనంతా ఫాస్టుగా..ఒక బొమ్మ మరో బొమ్మగా మారిపోయే మాయాజాలం ఈ చిత్రాల ప్రత్యేకత అని చెప్పక తప్పదు ఈ వీడియో చూసాక.

Read more : Singing Ringing Tree : గాలి స్థాయిని బట్టి పాటలు పాడే చెట్టు

ఈ వీడియో మాత్రం విస్మయానికి గురిచేసే విధంగానే కాకుండా ఒక ఆర్టిస్ట్‌ కళాత్మక దృష్టి కోణం అగుపడుతున్నట్లుగా ఎంతో చక్కగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొదట మనకి ఒక అందమైన అమ్మాయి నెలపై కూర్చొని న్యూస్‌ పేపర్‌ చదువుతున్నట్లు అనిపిస్తుంది. అంతలోనే ఆ అమ్మాయి మీద వేరే అమ్మాయి వచ్చి ఒక కర్చీఫ్‌ వేసేటప్పటికీ ఇంతలో కూర్చొని చదువుతున్న ఆ అమ్మాయి కాస్త చిత్రంగా మారిపోతుంది. ఈ అ‍మ్మాయి ఆ చిత్రాన్ని చెరిపి దానిపైన అందంగా నవ్వుతూ కూర్చుంటుంది. మళ్లీ కాసేపటికి అదంతా చిత్రంగా మారిపోయి దాన్ని చిత్రిస్తున​ అదే అ‍మ్మాయి ఆర్టిస్టుగా వీడియో చివర్లో కనిపిస్తుంది. నిజంగా వావ్ అనిపించే ఈ చిత్రాల మాయ వెరీ వెరీ స్పెషల్ అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Read more :Stray Dog Boji : 10ఏళ్లుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో దర్జాగా తిరిగేస్తున్న కుక్క..ఏం చేస్తుందో తెలుసా? 

ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఆర్టిస్టే తనను తానే అన్నిరకాలుగా చిత్రికరించి అద్భుతంగా రూపొందించడం మరో వింత విశేషం అని చెప్పి తీరాల్సిందే. ఇన్ని చిత్రాలు చేసే ఈ విచిత్ర ఆర్టిస్టు ఎవరంటే..అంతర్జాతీయ త్రీడీ పెయింటింగ్‌ కళాకారిణీ, వరల్డ్‌ రికార్డు గ్రహీత అయిన శిఖా శర్మ.తన ‘ట్రిప్పింగ్’ ప్రతిభతో దృష్టిని మరల్చినివ్వని కనికట్టుతో అ‍త్యంత అద్భుతంగా తన ప్రతిభతో మనల్ని మంత్ర ముగ్దుల్ని చేసేస్తోంది. ఈ చిత్రాల వింతల గురించి ఎన్ని చెప్పినా..ఎంత చెప్పినా తక్కువే. చదవడం కంటే చూస్తేనే ఆ గొప్పదనం ఏంటో తెలుస్తుంది నెట్టింట తెగ ఆకట్టుకంటున్నీ ఈ వీడియోపై ఓ లుక్ వేయండీ..ఇది చిత్రాలకే చిత్రం అని తప్పకుండా అంటారు.