Stray Dog Boji : 10ఏళ్లుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో దర్జాగా తిరిగేస్తున్న కుక్క..ఏం చేస్తుందో తెలుసా?

10ఏళ్లుగా ఓ కుక్క పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో తెగ తిరిగేస్తోంది. మరి అది ఎక్కడకు తిరుగుతోంది? ఎందుకు తిరుగుతోందో తెలుసుకన్న అధికారులు షాక్ అయ్యారు.

Stray Dog Boji  : 10ఏళ్లుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో దర్జాగా తిరిగేస్తున్న కుక్క..ఏం చేస్తుందో తెలుసా?

Stray Dog Boji

Stray Dog Boji  : ఊరంతా అచ్చోసిన అంబోతులాగా తిరుగుతావ్..పనేమీలేదా? అని పెద్ద వాళ్లు తిట్టేవారు. ఆ తిట్లలో అంబోతుకు బదులుగా ఓ కుక్కగారి గురించి చెప్పుకుందాం. ఎందుకంటే అంబోతులు బస్సులు, రైళ్లు ఎక్కవు కదా..కానీ ఈ కుక్క మాత్రం రైలు,బస్సు,మెట్రో ట్రైను అన్నీ ఎక్కేస్తుంది.ఎక్కడికంటే అక్కడికి తిరిగేస్తుంటుంది. గత 10 ఏళ్లుగా ఈ కుక్క అలాగే తిరుగుతోంది. అన్ని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు దీనివే. ఏది ఎక్కాలనిపిస్తే అది ఎక్కేస్తుంది. దర్జాగా సీట్లు కూర్చుంటుంది. ఒక వేళ ఈ కుక్క ఎక్కే సమయానికి సీట్లు ఫుల్ అయిపోతే సీట్లో కూర్చున్నవారు లేచి మరీ ఈ కుక్కగారికి సీటు ఇస్తారు. అంతటి రాజయోగంతో ఊరంతా బలాదూర్ తిరిగే ఈ కుక్కగారి స్టోరీ మాత్రం భలే ఇంట్రస్టింగ్.ఎందుకంటే అధికారులే ఈ కుక్క బస్సులు, ట్రైన్స్, మెట్రో ఇలా ఏదైతే అది ఎక్కేసి ఎక్కడెక్కడికి తిరుగుతోందబ్బా..అని ఇంట్రెస్టింగ్ చూపించారు. అంటే దీని స్టోరీ ఏంటో తెలుసుకోవాల్సిందే. మరి తెలుసుకుందామా? ఈ కుక్కగారి రాయల్ జర్నీ గురించి. అదేనండీ బలాదూర్ జర్నీ గురించి..

Read more : picasso paintings : రూ. 817 కోట్ల ధర పలికిన పికాసో పెయింటింగ్స్..

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌. ఏ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనంలో చూసినా ఓ కుక్క దర్జాగా సీట్లో కూర్చుని కనిపిస్తుంది. ఆ వాహనాల్లో తిరిగే ప్రయాణికులందరికీ ఈ కుక్కగారి గురించి తెలుసు. ఎందుకంటే ఎవ్వరైనా పని లేకో..లేదా ఆఫీసులకు సెలవు పెట్టో ఇంట్లో ఉంటారు. వారి పనులు చూసుకుంటారు. కానీ ఈకుక్క మాత్రం ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా తిరుగుతునే ఉంటుంది. ఈ కుక్కగారి పేరు ‘బోజీ’. గత పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, కనిపించిన బస్సు లేదా లోకల్‌ ట్రెయిన్‌ ఎక్కి ఊరంతా బలాదూర్‌ తిరగడం ఈ బోజీ హాబీ. ఇలా కనిపించిన ప్రతీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనంలోను దర్జాగా ఎక్కి కూర్చుని ఈ బోజీని అధికారులు గమనించారు. అది రోజు ఎక్కడెక్కడకు తిరుగుతోంది? ఎందుకు వెళుతోంది? అని తెలుసుకోవటానికి అధికారులు దాని చెవికి ఒక ట్రాక్‌ చిప్‌ అమర్చారు. ఇస్తాంబుల్‌ నగరంలోని చారిత్రిక కట్టడాలను చూడటానికి ఈ శునకరాజం రోజూ బస్సు, మెట్రో, బోటు సహా ప్రతి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వాహానాల్లోను తిరుగేస్తోంది. అది అలా తిరుగుతు చిరాత్రిక కట్టడాలకే వెళుతోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఏదో బస్ ఎక్కేసి తిరిగేస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ బోజీకి మెట్రో ట్రైన్ లో ప్రయాణించటమంటే బోలెడంత ఇష్టం. ఎక్కువగా మెట్రో ట్రైన్ లోనే తిరుగుతుంది. బస్సుల్లో చాలా తక్కువ. మెట్రోస్టేషన్‌లలోని లిఫ్టులు ఎక్కటం, ఎస్కలేటర్ల ఎక్కటం అంటే దీనికి చాలా చాలా ఈజీ. ప్రయాణికులతో కలసి దర్జాగా వీటిని భలే ఉపయోగించుకుంటుంది.ఇస్తాంబుల్‌ జనాలకు గత 10ఏళ్లుగా ఈ బోజీ అలవాటైపోయింది. మెట్రో ఎక్కగానే బోజీ ఉందో లేదో చూసుకుంటారు. అంతలా అలవాటైపోయింది వారికి బోజీ. బోజీ బాగా అలవాటైపోవడంతో ప్రయాణీకులు అది ఏ వాహనంలోకి చొరబడినా ఎవరూ దీనిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించరు.

Land free : ఆ సిటీలో ఇల్లు కట్టుకుంటే స్థలం ఫ్రీ : ప్రకటించిన ప్రభుత్వం..

పైగా..దాని కోసం సీట్లో కూర్చున్నవారు కూడా లేచి దానికి సీట్ ఆఫర్ చేస్తారు. అదికూడా ఏమాత్రం సందేహించకుండా దర్జాగా సీట్లు కూర్చుంటుంది. మీరన్నా మిస్ అవుతారేమోగానీ ఇది నా హక్కు అన్నట్లుగా దర్జాగా రాజసంగా కూర్చుంటుంది సీట్లో. పక్కనున్నవారి మొహంలో మొహం పెట్టి ఏంటీ రెండు రోజుల నుంచి కనిపించట్లేదు అన్నట్లుగా చూస్తుంది.సమయానికి సమయం, శ్రమకు శ్రమ ఆదా చేసే మెట్రో ట్రెయినంటేనే దీనికి కాస్త మక్కువ ఎక్కువ. ఎక్కువగా మెట్రోలో ప్రయాణించడానికే ఇష్టపడుతుంది.