picasso paintings : రూ. 817 కోట్ల ధర పలికిన పికాసో పెయింటింగ్స్..

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన చిత్రాలు రూ. 817 కోట్ల ధరకు అమ్ముడైపోయాయి.

picasso paintings : రూ. 817 కోట్ల ధర పలికిన పికాసో పెయింటింగ్స్..

Picasso Paintings

picasso paintings : పికాసో.ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. ఎన్ని చిత్రాలు వేసినా..ఆయన రంగుల దాహం తీరేది కాదు. ఆయన కుంచె గీత పయనం ఆగేది. అటువంటి పికాసో చిత్రాలు మరోసారి రికార్డు ధరకు అమ్ముడై పికాసోకు పికాసోయే పోటీ అనిపించాయి. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 9 చిత్రాలు, రెండు సిరామిక్‌ వస్తువులకు 108.9 మిలియన్‌ డాలర్ల (రూ. 817 కోట్లు) ధర పలికింది. శనివారం (24,2021) పికాసో 140వ జయంతి సందర్భంగా అమెరికాలోని లాస్‌వెగాస్‌లో సౌత్‌బే అనే సంస్థ ఈ వేలం నిర్వహించగా ఈ వేలంలో పికాసో వేసిన తొమ్మిది పెయింటింగ్ లు భారీ ధరకు అమ్ముడైపోయి దటీజ్ పికాసో పెయింటింగ్స్ అనిపించాయి. కాగా వేలం నిర్వాహకులు ఈ చిత్రాలను కొనుగోలు చేసిన వ్యక్తులు పేర్లు మాత్రం వెల్లడించలేదు.ఈ వేలంలో అమ్ముడైన ఈ తొమ్మిది చిత్రాల్లో ఒకటి “Femme au beret rouge-orange” ఎరుపు- నారింజ రంగు టోపీ ధరించిన మహిళ చిత్రం ఒకటి.

Read more : 1765 Antarctic Air : 1765 నాటి ‘గాలితో శిల్పం’..త్వరలో ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శన

ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన పికాసో పూర్తి పేరు పాబ్లో పికాసో. ఇతను స్పానిష్ శిల్పి, చిత్రకారుడు కూడా. 1881 అక్టోబర్ 25న స్పెయిన్ లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు. ఇప్పటికీ పెయింటింగ్ అంటే పికాసోనే గుర్తుకొచ్చేంత పేరు ప్రతిష్టలు ఈయన సొంతం.పికాసో తండ్రి డ్రాయింగు టీచరు. పికాసో తన ఎనిమిదవ సంవత్సరాలోనే రంగులతో బొమ్మలు వేసేవాడు. అతని చిత్రాలు అప్పట్లోనే మంచి గుర్తింపు పొందాయి. అతని 14ఏళ్లలోనే పికాసో వేసిన పెయింటింగ్ ల ప్రదర్శన “వన్ మాన్స్ ఎగ్జిబిషన్” పేరుతో నిర్వహించారు. 1903లో పికాసో కళాకారులందరికి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ యాత్రాస్థలమైన ప్యారిస్ వెళ్ళాడు. ప్యారిస్ నగరం ఆయన కళను పెంచి పోషించింది. అక్కడే స్థిరపడ్డాడు. కొత్త కొత్త కళారూపాలతో ప్రయోగాలు చేస్తూ అమేయమైన సృజనాత్మక కృషితో జీవితం గడిపాడు. ప్యారిస్ లో పికాసో కళాజీవితంలో ప్రధానంగా రంగులవాడకాన్ని బట్టి మూడు దశలున్నాయని కళా విమర్సకులు చెబుతారు.

Read more : 1765 Antarctic Air : 1765 నాటి ‘గాలితో శిల్పం’..త్వరలో ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శన

పికాసో తొలిరోజుల్లో బ్లూ పీరియడ్-అంటే నీలందశ.రెండవది పిక పీరియడ్ అనగా పాటల వర్ణం దశ. మూడవది నీగ్రో దశ. 1902 నుంచి 1905 వరకూ నీలం దశ రకరకాల నీలవర్ణఛ్ఛాయలతో ఆయన చిత్ర రచన చేసిన ఈ దశలో జీవితం అనే చిత్రం గొప్పది. ఈ దశలో భిన్నుడై ఆకలినీ, దారిద్రాన్ని సూచించే బిచ్చగాళ్ళను, వికలాంగులను మానవ అస్తిత్వంలోని వ్యాకులమునూ,విషాదాన్ని ప్రధానంగా చిత్రీకరించాడు.1905 నుంచీ పికాసో పాటల వర్ణపుఛాయలలో చిత్రాలు వేశాడు.కాలక్రమంలో పికాసో చిత్రకారుడిగా ఖ్యాతి పొందాడు. పెద్ద పెద్ద ఆర్టిస్టుల మన్ననలు పొందాడు. విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు.

Read more : Lionel Messi: ముక్కు,మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్‌ ధర రూ. 7.5 కోట్లు

1907లో నీగ్రోదశ మొదలైనప్పుడు అతని చిత్రాలపై స్పానిష్, నీగ్రో శిల్పాల ప్రాభావం పడింది. ఈ దశలోనే కళాప్రపంచంలో ఆయన ఒక గొప్ప విప్లవం తీసుకొచ్చాడని చెప్పాలి. అంతవరకూ పాశ్చాత్య చిత్రకారులు కళారంగంలో సాంప్రదాయకమైన సహజవాదమును అనుసరిస్తూండే పికాసో ఆఫ్రికన్ చెక్కడాల వనితనుంచే ప్రభావితుడై ఒక అపూర్వ సంచలనం కలిగించాడు.చిత్రాల గీతల్లో ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఎంతో పేరు ప్రఖ్యాతులు. అయినా ఆయన రంగుల దాహం తీరేది కాదు.గీత పయనం ఆగేది కాదు. అలా పికాసో తన 85వయేట కూడా రాత్రి భోజనం చేసి రాత్రి అంతా చిత్రాలు గీస్తూ ఉండేవాడట. 88 ఏండ్ల వయస్సులో 185 వర్ణ చిత్రాలు, 45 డ్రాయింగులు వేశాడని చెబుతారు.91 ఏళ్ళు జీవించి, జీవించి ఉండగానే పురాణ పురుషుడుగా లోకంచే కీర్తించబడి 1973లో పికాసో కన్నుమూశాడు.

Read more : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే