Land free : ఆ సిటీలో ఇల్లు కట్టుకుంటే స్థలం ఫ్రీ : ప్రకటించిన ప్రభుత్వం..

ప్రశాంతమైన వాతావరణం..విశాలమైన రోడ్లు గల సిటీలో ఇల్లు కట్టుకుంటే స్థలం ప్రీగా ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఎంతోమంది అక్కడ ఇల్లు కట్టుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు.

Land free : ఆ సిటీలో ఇల్లు కట్టుకుంటే స్థలం ఫ్రీ : ప్రకటించిన ప్రభుత్వం..

Land Free In City (3)

free land offer  : సొంత ఇల్లు అందరి కల. ఇండిపెండెంట్ ఇల్లు చాలామంది కల. కానీ స్థలం కొనాలంటే చుక్కల్లో ధరలు. దీంతో ఇల్లు కట్టుకోవటం ఎలా ఉన్నా..స్థలం కొనాలంటేనే భయం. అదే స్థలం ఫ్రీగా వస్తే..ఎంచక్కా మనకు నచ్చిన మోడల్ లో ఇల్లు కట్టేసుకోవచ్చు. కానీ స్థలం ఫ్రీగా ఎలా వస్తుంది? అది జరిగేపని కాదు. కానీ జరుగుతుంది. అదికూడా ప్రభుత్వమే ఉచితంగా స్థలం ఇవ్వటానికి రెడీగా ఉంది. ప్రభుత్వమే ఇస్తుంది అంటే ఇక ఆలోచించటం దేనికి భయపడటం దేనికి చక్కగా ఇల్లు కట్టేసుకోవచ్చు. ఏంటీ మరి రెడీనా సొంత ఇల్లు కట్టుకోవటానికి. ఐయామ్ రెడీ అంటారా? మరి అలా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ కాదు ఇండియాలో అస్సలే కాదు. ప్రభుత్వం ఫ్రీగా స్థలం ఇచ్చేది ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరంలో..

పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం. ఇది ప్రపంచం లోని ఆరవ అతి పెద్ద దేశం. 7 ఖండాలలో ఒకటి, విస్తీర్ణంలో అతి చిన్న ఖండం. అటువంటి ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరానికి చెందిన స్థానిక ప్రభుత్వం కూడా తాజాగా ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నగరంలో జనాభా పెంచాలనే ఉద్ధేశంతో..ఇక్కడకొచ్చి ఇల్లు కట్టుకునేవారికి స్థలం ఉచితంగా ఇస్తామని ప్రకటింది. క్విల్పీ నగరంలో జనాభా ప్రతి ఏడాది పడిపోతుండటంతో.. దీంతో ప్రజలు అక్కడకు వచ్చి స్థిరపడాలనే ఉద్దేశంతో ఫ్రీ ల్యాండ్‌ను ఆఫర్ చేస్తూ ప్రటకన విడుదల చేసింది. నగరం అనే పేరే గానీ క్విల్పీ నగరంలో కేవలం 800లమంది మాత్రమే నివసిస్తున్నారు. దీంతో ఈ నగర జనాభా పెంచాలని నగర పాలకులు ఇటువంటి ప్రకటన చేశారు.

Read more : ఇటలీ గ్రామం స్పెషల్ ఆఫర్: 86రూపాయలకే ఇల్లు.. కండిషన్స్ అప్లై

క్విల్పీలో స్థిరపడాలనుకునేవారికి ఇల్లు కట్టుకునేందు స్థలాన్ని ఉచితంగా ఇస్తామని సిటీ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో ఈ ప్రకటన పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అలా ఇప్పటి వరకూ 250 మంది ఫ్రీ ల్యాండ్ కోసం ఆరా తీసారని నగర అధికారులు తెలిపారు. ఒక్క ఆస్ట్రేలియా నుంచే కాకుండా ఇతర దేశాలనుంచి కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవటానికి చాలామంది ఆశపడుతున్నారని తెలిపారు.భారత్, న్యూజిలాండ్, బ్రిటన్, హాంగ్ కాంగ్ దేశాలకు సంబంధించిన ప్రజలు భారీ మొత్తంలో ఈ ఫ్రీ ల్యాండ్ ప్రకటన గురించి ఆరా తీస్తున్నారని నగర అధికారులు తెలిపారు. కానీ ఆస్ట్రేలియా పౌరులకు, పర్మినెంట్ రెసిడెంట్ హోదా కలిగిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని క్విల్పీ నగర అధికారులు స్పష్టం చేశారు.జనాభా కొరత వల్ల పశుపోషణ, గొర్రెల పెంపకానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకే ఈ ఫ్రీ ల్యాండ్ ప్రకటన ఇచ్చామని అధికారులు తెలిపారు.

Read more : 9 Babies Mother : ఒకేకాన్పులో 9మంది పిల్లలు..రూ.10కోట్ల ఆస్పత్రి బిల్లు..!ఆ పిల్లల్ని పెంచటానికి తల్లిదండ్రుల పాట్లు..

ఈ పట్టణం ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని పశ్చిమంవైపు ఉంటుంది. చాలా దూరంగా ఎడారిలో విసిరేసినట్లుగా ఉంటుంది. అక్కడ ఈ కొత్త ఆఫర్ తెచ్చింది క్విల్పీ లోని షైర్ కౌన్సిల్. ఈ పట్టణంలో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్ని పెద్ద సంఖ్యలో పెంచుతారు. ఇప్పుడు అక్కడ జనాభా సంఖ్య తగ్గిపోవడంతో… వాటిని చూసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. అంతేకాదు చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రకరకాల పనులు చేసేవారి కొరత ఏర్పడింది. ఆ పనులు చేసేవారు దొరకాలంటే… వేరే పట్టణాల నుంచి రావాల్సి వసతోంది. మరోవైపు ఇళ్ల కొరత కూడా ఉంది. వాటి సంఖ్యను పెంచాల్సి ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఆఫర్ తెచ్చారు.

Read more : picasso paintings : రూ. 817 కోట్ల ధర పలికిన పికాసో పెయింటింగ్స్..

కాగా..క్విల్పీ పట్టణం ప్రశాంతంగా ఉంటుంది. పైగా అక్కడ కరోనా కూడా లేదు. ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఆఫర్ అందరికీ నచ్చేస్తోంది. ఇక పట్టణంలో ఇళ్ల మధ్యలో గ్యాప్ బాగా ఉంటుంది. రోడ్లు విశాలంగా, అందంగా ఉంటాయి. ఐతే.. అక్కడ ఉండేవారికి సొంత వెహికిల్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే… ఇప్పుడు అక్కడ ఏ వస్తువులు కావాలన్నా… చార్లెవిల్లే, రోమా, బ్రిస్బేన్ వంటి చోట్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ సమస్య కాదులే అని మీరు అనుకుంటే… మీరు కూడా ట్రై చేసుకోవచ్చు అంటున్నారు అక్కడి పాలకులు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌లోకి వెళ్లొచ్చు