9 Babies Mother : ఒకేకాన్పులో 9మంది పిల్లలు..రూ.10కోట్ల ఆస్పత్రి బిల్లు..!ఆ పిల్లల్ని పెంచటానికి తల్లిదండ్రుల పాట్లు..

ఒకేకాన్పులో తొమ్మిదిమంది బిడ్డలకు జన్మనిచ్చిన 25 ఏళ్ల హలీమా సిస్సే గుర్తుందా? రూ.10కోట్ల హాస్పిటల్ బిల్లు, అప్పటికేే ఉన్నమరో బిడ్డతో సహా 10మంది పిల్లల్ని పెంచటానికి ఆ తల్లి..

9 Babies Mother : ఒకేకాన్పులో 9మంది పిల్లలు..రూ.10కోట్ల ఆస్పత్రి బిల్లు..!ఆ పిల్లల్ని పెంచటానికి తల్లిదండ్రుల పాట్లు..

Nine Child Babeys Mother

9 Babies Mother Halima Cisse : ఒకేకాన్పులో తొమ్మిదిమంది బిడ్డలకు జన్మనిచ్చిన 25 ఏళ్ల హలీమా సిస్సే గుర్తుందా? ఆమె అంతమంది పిల్లలు ఎలా పెంచుతుందో ఏమో అని చాలామంది అప్పట్లో ఆశ్చర్య వ్యక్తం చేశారు. నిజమే. ఆమె ఇప్పుడు ఆ బిడ్డల్ని పెంచుకునేందుకు నానా కష్టాలు పడుతోంది. అప్పటికే ఓ బిడ్డ ఉన్న ఆమె మొత్తం 10మంది పిల్లల్ని పోషించటానికి కష్టాలు పడుతోంది. తొమ్మిది మంది బిడ్డల్ని సిజేరియన్ ద్వారా సురక్షితంగా ప్రసవించిన తరువాత హాస్పిటల్ వేసిన బిల్లు రూ.10 కోట్లు మాలి ప్రభుత్వం సహాయంతో చెల్లించాక..ఇప్పుడు తొమ్మిదిమంది బిడ్డలతో పాటు అప్పటికే ఉన్న మరో బిడ్డ మొత్తం కలిపి 10మంది పిల్లల్ని పెంచటానికి హలీమా దంపతులు ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు.

హలీమా గర్భం కథ..ముగ్గురనుకుంటే పుట్టిన 9మంది పిల్లలు..
పశ్చిమ ఆఫ్రికాకు చెందిన మాలి దేశంలో కాదర్, హలీమా దంపతులు నివసిస్తున్నారు. వారికి ఓ ఆడపిల్ల ఉంది. ఈక్రమంలో 25 ఏళ్ల హలీమా రెండో సారి గర్భం దాల్చింది. వైద్య పరీక్షల కోసం మాలిలోని ఓ హాస్పిటల్ కు వెళ్లారు. హలీమాను పరిశీలించిన డాక్టర్లు ఆమె గర్భంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉండొచ్చని చెప్పారు. కానీ హలీమాకు నెలలు నిండే కొద్దీ పొట్ట భారీగా పెరిగింది. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో మొరాకో అనే దేశానికి వచ్చారు. అక్కడ మరోసారి పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు స్కానింగ్ చేసి ఖంగుతిన్నారు.

Read more :107 years twin sisters: ప్రపంచంలోనే వృద్ధ కవలలు..గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

రూ. 10 కోట్ల బిల్లు..
హలీమా గర్భంలో ఏకంగా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. కానీ అప్పటికే ఆమెకు శ్వాస ఆడటంలేదు.గర్భం మోయటం కష్టంగా మారింది. దీంతో నెలలు నిండకుండానే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో వేరే దారిలేక హలీమా దంపతులు అంగీకరించటంతో డాక్టర్లు సిజేరియన్ చేసి తొమ్మిదిమంది పిల్లలను సురక్షితంగా బయటికి తీశారు. వీరిలో నలుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు.వారు నెలలు నిండకుండా ప్రసవించడంతో డాక్టర్లు పిల్లల ఆరోగ్య రీత్యా ఇంక్యుబేటర్‌లో పెట్టారు. కొన్ని రోజులకు హలీమా డిశార్జ్ అయ్యే సందర్భంగా వారికి పదిన్నర కోట్ల రూపాయల(భారత కరెన్సీలో) బిల్లు వేశారు. దీంతో హలీమా దంపతులు షాక్ అయ్యారు. ఓ పక్క వారిని ఎలా పెంచాలా? అని ఆలోచిస్తుండగా మరోపక్క హాస్పిటల్ బిల్ చూసివారు బేజారెత్తిపోయారు. ఆవేదన చెందారు. కానీ మాలి దేశం వీరు కట్టాల్సిన బిల్లులో చాలా వరకు కట్టింది. మిగతాది హలీమా దంపతులే వారివి కొన్ని ఆస్తులు అమ్మి కట్టారు. ఇదంతా గత మే నెలలో జరిగింది.

Read more : 400మంది కవలలు : సైన్స్ ఛేదించలేని సీక్రెట్ విలేజ్

అప్పట్లో అంతమంది పిల్లలను హలీమా ఒకేసారి ఎలా పోషిస్తుంది అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజమే మరి. హాస్పిటల్ బిల్లు కోసం చాలానే కట్టారు. తరువాత హలీమా కూడా 9 మంది పిల్లలను సాకడానికి అష్టకష్టాలు పడింది. పిల్లందరికీ పాలివ్వాలంటే రోజుకు ఆరు లీటర్లు అవసరం అవుతున్నాయని, అంతేకాకుండా ప్రతిరోజూ వారికి 100 డైపర్లు మార్చాల్సి వస్తోందని హలీమా చెప్పింది. ఆస్పత్రి బిల్లే తనకు రూ.10 కోట్ల వరకు అయ్యిందని.. అయితే అందులో ఎక్కువ శాతం బిల్లు మాలీ ప్రభుత్వమే చెల్లించిందని..కొంతమేం కూడా కలిపి చెల్లించామని తెలిపింది. ప్రస్తుతం నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడంతో మే నెల నుంచి ఇప్పటివరకు ఆస్పత్రికి సమీపంలోనే ఇల్లు తీసుకుని ఉంటున్నామని.. తమను వైద్యులు చాలా బాగా చూసుకుంటున్నారని.. పిల్లలందరూ సాధారణ బరువుకు చేరుకున్న తర్వాత తాము తమ దేశమైన మాలీకి వెళ్లిపోతామని చెప్పింది. భవిష్యత్తులో పిల్లల ఆహారం, చదువు, కనీస అవసరాలకు చాలా డబ్బు అవసరం అవుతుందని.. ప్రభుత్వం తమకు సాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు హలీమా ఆశాభావం వ్యక్తం చేసింది.

Read more : 107 years twin sisters: ప్రపంచంలోనే వృద్ధ కవలలు..గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

హలీమా దంపతులు మగ పిల్లలకు ఒమర్, ఎల్హద్జీ, బాహ్, మొహమ్మద్ అని, ఆడ పిల్లలకు అడామా, ఒమౌ, హవా, కడిడియా, ఫాతౌమ అని పేరు పెట్టారు. తాము ఇంటికి వెళ్లాక ఈ పిల్లల్ని ఎలా పెంచాలో. ఎలావారిని పెద్ద చేయాలో..తామంతా ఎలా జీవించాలని ఆవేదన చెందుతున్నారు. ఇంతమంది పిల్లలు పుట్టారని వారంతా క్షేమంగా ఉన్నారని సంతోషపడాలా? లేదా వారి పోషణ, చదువు కోసం మదన పడాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు హలీమా దంపతులు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరి మాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.