Iran, China sign agreement : 25ఏళ్ల సహకార ఒప్పందంపై సంతకం చేసిన ఇరాన్, చైనా

ఇరాన్, డ్రాగన్ చైనా మిత్రదేశాలు 25ఏళ్ల సహకార ఒప్పందానికి సై అన్నాయి. ఇరుదేశాల మధ్య సుదీర్ఘ కాలం పాటు సత్సంబంధాలు కొనసాగేందుకు చైనా, ఇరాన్ విదేశాంగ మంత్రులు సంతకం చేశారు.

Iran, China sign 25-year cooperation agreement : ఇరాన్, డ్రాగన్ చైనా మిత్రదేశాలు 25ఏళ్ల సహకార ఒప్పందానికి సై అన్నాయి. ఇరుదేశాల మధ్య సుదీర్ఘ కాలం పాటు సత్సంబంధాలు కొనసాగేందుకు చైనా, ఇరాన్ విదేశాంగ మంత్రులు సంతకం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి అక్కడి టీవీల్లో లైవ్ టెలిక్యాస్ట్ అయింది. ‘ఇరాన్‌తో మా సంబంధాలు ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రభావితం కావు, కానీ శాశ్వతంగా వ్యూహాత్మకంగా ఉంటాయి’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని చెప్పినట్టు ఇరాన్ వార్తా సంస్థలు గతంలో పేర్కొన్నాయి. ఇరాన్ ఇతర దేశాలతో తమ సంబంధాలపై స్వతంత్రంగా నిర్ణయిస్తుందని పేర్కొంది.

ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే వాంగ్ అధ్యక్షుడు హసన్ రౌహానీని కలిశారు. ఇంధన, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలలో చైనా పెట్టుబడులను చేర్చాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక, రవాణా సహకారం కోసం రోడ్‌మ్యాప్ అని, రెండు వైపుల ప్రైవేట్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు.

ఇరాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటైన చైనా, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 10 రెట్లు ఎక్కువ చేసి 600 బిలియన్ డాలర్లకు పెంచడానికి 2016లో అంగీకరించింది. బీజింగ్ 2015 ఇరాన్ అణు ఒప్పందాన్ని పరిరక్షించడానికి ప్రయత్నిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు