వార్‌కు రెడీ..! ఏ క్షణమైనా దాడులకు దిగుతామంటూ ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్..!

ఇజ్రాయెల్ పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అదును చూస్తోంది. దెబ్బకొట్టడానికి కరెక్ట్ టైమ్ ఫిక్స్ చేసుకున్నామని, ఇక అటాక్సే అంటోంది.

Israel Iran War : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తీవ్రంగా కమ్ముకుంటున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య టెన్షన్స్ తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పై కౌంటర్ అటాక్స్ చేస్తే.. ఇప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై కాలు దువ్వుతోంది. దాడులకు పక్కా ప్లాన్ ను ఫిక్స్ చేసుకుంటోంది. ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చని సిగ్నల్స్ పంపుతోంది. తమ రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటుందని అటు ఇజ్రాయెల్ తో పాటు అమెరికాకు స్ట్రాంగ్ గా హెచ్చరికలు చేస్తోంది ఇరాన్. ఇదే జరిగితే మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు మరింత దిగజారుతాయి. ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడ్డట్లే అని అంటున్నారంతా. ఇంతకీ పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది?

హమాస్, హెజ్ బొల్లాకు అండగా ఉన్న ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ తో డైరెక్ట్ గా వార్ కు సై అంటోంది. ఇప్పటికే ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్స్ చేసింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ దేశంతో పాటు మిత్రపక్షాలపై దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తమ ప్రతిస్పందన చాలా గట్టిగా ఉంటుందంటూ అటు ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను కూడా హెచ్చరించారు. ఇరాన్ రెసిస్టన్స్ ఫ్రంట్ విషయంలో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న పనులకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అక్టోబర్ 1 టెల్ అవీవ్ పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో క్షిపణి తయారీ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ హెచ్చరించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు వార్ ప్లాన్స్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని న్యూయార్స్ టైమ్స్ పత్రిక బయటపెట్టింది. ఇజ్రాయెల్ లోని ఏయే లక్ష్యాలను ఢీకొట్టాలో ఇప్పటికే టెహ్రాన్ నిర్ణయించింది అనేది దీని సారాంశం. దాడి ప్రణాళికను మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిన తర్వాతే అమలు పరచాలని భావిస్తోంది ఇరాన్.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు దాడి చేస్తే ఆ వాతావరణం ట్రంప్ నకు అనుకూలంగా మారే అవకాశం ఉందని ఇరాన్ భావిస్తోంది. అందుకే, దాడిని వాయిదా వేసుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక బయటపెట్టింది. ఇజ్రాయెల్ పై ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలని సైనిక అధికారులను ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ.. ఆల్రెడీ ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇరాక్ భూభాగం నుంచి కూడా ఇరాన్ తమ అనుకూల మిలిటెంట్లతో దాడి చేయించొచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఇరాక్ పైనా ఓ కన్నేసి ఉంచింది ఇజ్రాయెల్. అలాగని ఇజ్రాయెల్ కూడా తగ్గట్లేదు. ఇరాన్ హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. లెబనాన్ లో వైమానిక దాడులు చేసి భారీగా విధ్వంసం సృష్టించింది.

ఇరాన్ కు మద్దతుగా ఉండే హమాస్ ను ఖల్లాస్ చేసింది ఇజ్రాయెల్. హెజ్బొల్లా టాప్ లీడర్స్ ను టార్గెట్ చేసింది. అంతేకాదు ఇరాన్ లో దూరి కీలకమైన వార్ జోన్స్ పై విరుచుకుపడింది. దీంతో ఇరాన్ పుండుపై కారం చల్లినట్లు అయ్యింది. ఇజ్రాయెల్ పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అదును చూస్తోంది. దెబ్బకొట్టడానికి కరెక్ట్ టైమ్ ఫిక్స్ చేసుకున్నామని, ఇక అటాక్సే అంటోంది.

 

Also Read : అమెరికా ఎన్నికలు.. హాలీవుడ్ సెలెబ్రిటీలు, బిజినెస్ టైకూన్స్ ఎవరి వైపు?