అమెరికా ఎన్నికలు.. హాలీవుడ్ సెలెబ్రిటీలు, బిజినెస్ టైకూన్స్ ఎవరి వైపు?

2016లో హిల్లరీ క్లింటన్ కు కూడా స్టార్ పవర్ క్యాంపైనింగ్ లో బాగా ఉపయోగపడింది. ఓట్లు కూడా పడ్డాయి.

అమెరికా ఎన్నికలు.. హాలీవుడ్ సెలెబ్రిటీలు, బిజినెస్ టైకూన్స్ ఎవరి వైపు?

Updated On : November 3, 2024 / 10:52 PM IST

US Election 2024 Celebrities Support : టైమ్ దగ్గర పడుతోంది. రోజుల నుంచి గంటల్లోకి పిక్చర్ మారిపోయింది. పెద్దన్న దేశానికి పెద్ద ఎవరనే తేలే ఘట్టం ప్రారంభమైంది. అమెరికాలో ఎన్నికలను ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. గెలుపు ఏ పార్టీది అయినా.. దాని ఎఫెక్ట్ వరల్డ్ మొత్తం ఉంటుందన్నది మాత్రం వాస్తవం. అక్కడ రాజకీయాలు అంతలా ప్రపంచంపై ప్రభావం చూపిస్తాయి. ఇంతకీ అమెరికా ఎన్నికల్లో ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్. పెద్దన్న దేశంలో పెద్ద తలకాయలన్నీ ఎటువైపు ఉన్నాయి. సెలెబ్రిటీలు, బిజినెస్ టైకూన్స్ ప్రభావం ఎంత? ఇంతకీ వాళ్లు ఎటువైపు?

హాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి బిజినెస్ టైకూన్స్ వరకు ఎవరికి వాళ్లు నచ్చిన పార్టీకి జై కొడుతున్నారు. బియాన్స్, టేలర్ స్విఫ్ట్, జెన్నిఫర్ లోపెజ్.. ఈ అవెంజర్స్ గ్రూప్ అంతా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ వైపే ఉన్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, కిడ్ రాక్, హల్క్ హోగన్ వంటి సెలబ్రిటీలంతా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు సపోర్ట్ పలికారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్టార్ వార్ కూడా రసవత్తరంగానే మారింది.

ఓ రకంగా చెప్పాలంటే చాలా మంది మూవీ స్టార్స్, మ్యూజిక్ వరల్డ్ అంతా కూడా కమలా హారిస్ పై చాలా హోప్స్ పెట్టుకుని ఆమె తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇది డెమొక్రటిక్ పార్టీకి పాజిటివ్ గా ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, ఇదొక్కటే గెలుపును డిసైడ్ చేస్తుందా అంటే చెప్పలేం. 2016లో హిల్లరీ క్లింటన్ కు కూడా స్టార్ పవర్ క్యాంపైనింగ్ లో బాగా ఉపయోగపడింది. ఓట్లు కూడా పడ్డాయి. కానీ, చివరకు ఓటమే మిగిలింది. కొన్ని సర్వేల ప్రకారం ఇక్కడి ఎన్నికల్లో సెలెబ్రిటీల సపోర్ట్ అనేది.. ఓటర్లపై 11శాతం మేర మాత్రమే ప్రభావం చూపిస్తుంది.

పాప్ మెగా స్టార్ గా పేరు సంపాదించిన టేలర్ స్విఫ్ట్ కూడా కమలా హారిస్ కు సపోర్ట్ గా నిలిచారు. టేలర్ స్విఫ్ట్ కు 283 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత తన ప్రచారం ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కమలా హారిస్ ను హక్కుల కోసం పోరాడే యోధురాలిగా పోల్చారు. ఆమెను చాంపియన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆమె అమెరికా అండగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు.

ఇక మాజీ యూఎస్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వెనుక కూడా చాలా మంది బిజినెస్ టైకూన్స్, సెలెబ్రిటీలు అండగా నిలిచారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎలాన్ మస్క్ గురించే. మస్క్ 75 మిలియన్ డాలర్లు ట్రంప్ ప్రచారం కోసం ఖర్చు చేశారు. ఒకప్పుడు మస్క్ డెమొక్రటిక్ పార్టీ వైపు ఉండేవారు. కానీ, ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి జైకొట్టారు. ప్రొఫెషనల్ ఎంటర్ టైనర్, రెజ్లర్ హల్క్ హోగన్ కూడా ట్రంప్ వైపే ఉన్నారు. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ట్రంప్ తరుపున ప్రచారం చేశారు. ట్రంప్ నకు తనకంటే బలమైన ఫోర్స్ ఉందని కొనియాడారు.

 

Also Read : అమెరికాలో అంతే.. ఓట్లు ఎక్కువ వచ్చినా ఓడిపోతారు, తక్కువ వచ్చినా గెలుస్తారు..!